More

  తీవ్రవాదులతో లింక్స్.. 5 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్

  హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఇ ఇస్లామీ, ఇస్లామిక్ స్టేట్‌తో సహా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు ఐదుగురిని సస్పెండ్ చేశారు. J&K ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారుల సేవలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(c) ప్రకారం తీవ్రవాద సంస్థలకు ఓవర్‌గ్రౌండ్ కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలియడంతో వారి సేవలు సస్పెండ్ చేయబడ్డాయని ఓ ప్రకటన విడుదలైంది.

  సెక్యూరిటీ లింక్‌లను చూసేందుకు వాచ్‌డాగ్‌గా వ్యవహరించే స్క్రూటినైజింగ్ కమిటీ ఇంతకుముందు ఎస్‌పిఓలుగా పనిచేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఆపరేటర్‌లు, రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక నర్సుతో సహా ఐదుగురు అధికారుల సేవలను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. పుల్వామా, శ్రీనగర్, అవంతిపొర, కుల్గాం, బారాముల్లా జిల్లాలతో సహా J&K కేంద్రపాలిత ప్రాంతంలో వీరు విధుల్లో ఉన్నారు. తొలగించబడిన అధికారులలో తౌసీఫ్ అహ్మద్ మీర్, గులాం హసన్ పర్రే, అర్షిద్ అహ్మద్ దాస్, షాహిద్ హుస్సేన్ రాథర్, షరాఫత్ అలీ ఖాన్ ఉన్నారు.

  గులాం హసన్ పర్రే

  పర్రే, శ్రీనగర్‌కు చెందిన ఒక కంప్యూటర్ ఆపరేటర్.. జమాత్-ఇ-ఇస్లామీ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ సహాయంతో J&K ప్రభుత్వ ఉద్యోగిగా చేరాడు. జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్ స్టేట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో అతను కీలక పాత్ర పోషించాడని, ముగీస్ అహ్మద్ వంటి యువకులను ఉగ్రవాద సంస్థలోకి చేర్చాడని తెలుస్తోంది. 2009లో, పరింపోరాలో దాడికి సంబంధించి J&K పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

  షాహిద్ హుస్సేన్ రాథర్
  2005లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నియమితుడైన షాహిద్ హుస్సేన్ రాథర్‌కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు బహిర్గతం కావడంతో అతనిని సేవల నుండి తొలగించారు. 2013లో ఆశ్చర్యకరంగా కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది లోయలోని ఉగ్రవాదులకు ఆర్మీ పరికరాలను సరఫరా చేయడం ప్రారంభించాడు. యురీలో అతని సహచరుల నుండి పోలీసులు హ్యాండ్ గ్రెనేడ్‌లు, చైనీస్ పిస్టల్స్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఉగ్రవాదంతో అతనికి ఉన్న సంబంధాలు బహిరంగమయ్యాయి.

  తౌసీఫ్ అహ్మద్ మీర్
  లోయలో ఉగ్రవాదంతో సంబంధాలపై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన రెండో పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్. తౌసీఫ్ తండ్రికి అల్-జిహాద్ సంస్థకు చెందిన వాడు. షోపియాన్‌లోని అల్‌-జిహాద్‌ నుంచి టెర్రర్‌ కమాండర్‌లకు మీర్‌ లాజిస్టిక్స్‌ సరఫరా చేశాడు. అతను వేర్వేరు ప్రయత్నాలలో ఇద్దరు పోలీసు అధికారులను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఉగ్రవాద సంస్థ కోసం యువకులను కూడా నియమించుకున్నాడు. తౌసీఫ్‌పై ప్రజా భద్రతా చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో 2017లో అతని సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు.

  షరాఫత్ అలీ ఖాన్
  తొలుత 1998లో ఎస్పీఓగా చేరిన షరాఫత్ ను ఆ తర్వాత ఆరోగ్య శాఖకు మళ్లించారు. ఖాన్ నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల చెలామణిలో పాల్గొన్నాడు. ఇది లోయలో టెర్రర్ ఫండింగ్ కు పనికొచ్చేది. 2021 జూన్‌లో బారాముల్లాలో పోలీసు కానిస్టేబుల్ షాహిద్‌తో కలిసి అరెస్టయ్యాక అతని కార్యకలాపాలు మొదట బహిర్గతమయ్యాయి.

  అర్షిద్ అహ్మద్ దాస్
  అర్షిద్ దాస్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అవంతిపోరాలోని జమాతే ఇస్లామీలో పనిచేశాడు. అతను హిజ్బుల్ ముజాహిదీన్‌తో సన్నిహితంగా ఉండేవాడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేవాడు. అవంతిపోరాలో CRPF సిబ్బందిపై రాళ్ల దాడిలో దాస్ పాల్గొన్నాడు. జమాత్-ఇ-ఇస్లామీ, ఇతర ఉగ్రవాద సంస్థల కోసం కూడా నిధులు సేకరించినట్లు నివేదించబడింది.

  డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoP&T) సూచనలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పాస్‌పోర్ట్‌లు పొందేందుకు విజిలెన్స్ క్లియరెన్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జమ్మూ మరియు కశ్మీర్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

  Trending Stories

  Related Stories