More

    ఐదు జనరేషన్లు ఒకే ఫ్రేమ్ లో..!

    మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు అందులో దర్శనం ఇస్తూ ఉంటాయి. క్షణాల్లో వైరల్ అవుతాయి. ఏప్రిల్ 9న, ఆనంద్ మహీంద్రా ఒకే కుటుంబంలోని ఐదు తరాల పురుషులు కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు.

    వైరల్ అవుతున్న వీడియోలో, పోడియంపై నిలబడి ఉన్న ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని పిలిచాడు. అతని తండ్రి తన తండ్రిని పిలుస్తాడు. కుటుంబంలోని ఐదు తరాలు ఒకే ఫ్రేమ్‌లో ఉండే వరకు సిరీస్ కొనసాగుతుంది. నిజంగా ప్రతి ఒక్కరి ముఖాల మీద చిరునవ్వు కనిపిస్తుంది. “What a blessing. 5 generations together. I wonder how many families around the world have this rare privilege of 5 generations, mothers or fathers, together. Would be great to see a similar video from India,” అంటూ ఆనంద్ మహీంద్రా వీడియోను పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కుటుంబాలలో 5 తరాల తల్లి లేదా తండ్రులు కలిసి ఉన్నారో తెలీదని.. ఈ అరుదైన ప్రత్యేకతను చూసి నేను ఆశ్చర్యపోతున్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో దాదాపు 5 లక్షల వ్యూస్ ను సంపాదించింది. నెటిజన్లు ఈ క్లిప్‌ పై లైక్స్ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. భారత్ కు చెందిన పలు కుటుంబాలు కూడా ఇలాంటి జనరేషన్స్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

    Trending Stories

    Related Stories