ఎన్ కౌంటర్ కు భయపడి.. 5 క్రిమినల్స్ సరెండర్

యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రౌడీలు, గూండాలు, గ్యాంగ్ స్టర్ల ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! బయట ఉంటే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో ఎంతో మంది రౌడీలు ఇప్పటికే తమ నేరాలను ఒప్పుకుని జైళ్లలో శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. తాజాగా మరో అయిదుగురు క్రిమినల్స్ ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ముందు సరెండర్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో అనేక నేరాల్లో భాగస్వామ్యులు, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి, గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అయిదుగురు క్రిమినల్స్ జూలై 5 (సోమవారం) రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయారు. హిందీ దినపత్రిక దైనిక్ జాగ్రన్ ఇచ్చిన నివేదిక ప్రకారం, కైరానా కొత్వాలి ప్రాంతం ఎస్హెచ్ఓ ప్రేమ్‌వీర్ రానా మాట్లాడుతూ నిందితులు వారంతట వారే పోలీసు స్టేషన్‌కు వచ్చారని.. నేరస్థులు అన్ని నేర కార్యకలాపాలను వదులుకోవాలని భావిస్తున్నామని, లొంగిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పోలీసు రికార్డుల ప్రకారం ఐదుగురు నేరస్థులైన అఫ్సారూన్, ఖయ్యూమ్, రషీద్ అలియాస్ భురా, సలీం, హారూన్ వీరందరూ రామ్డా గ్రామ నివాసితులుగా గుర్తించారు. వీరు దోపిడీ మరియు హత్య కేసులలో నిందితులు. వీరిపై ఇటీవల కఠినమైన గ్యాంగ్‌స్టార్ చట్టం కింద కేసు నమోదు చేయడంతో.. అప్పటి నుండి పరారీలో ఉన్నారు.
ఆదివారం నాడు మహబూబ్‌గా గుర్తించబడిన మరో నేరస్థుడు ముజఫర్ నగర్ షాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నేరాలను విడిచిపెడతానని చెప్పినట్లుగా కూడా మీడియా తెలిపింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జీరో టాలరెన్స్ పాలసీని (zero-tolerance policy)ని అమలు చేస్తూ ఉన్నారు. రౌడీ షీటర్ అనే ముద్ర పడిందంటే ఆ వ్యక్తికి పోలీసులు చుక్కలు చూపించనున్నారు. క్రిమినల్స్ సంఖ్యను సున్నా కు చేర్చడమే తమ లక్ష్యమని.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన సభల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రజలను తాము క్రిమినల్స్ పై తీసుకుంటున్న చర్యల గురించి అడగ్గా.. వారి దగ్గర నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
గొప్ప ఫలితాలను ఇచ్చిన జీరో టాలరెన్స్ పాలసీ
నేరస్థుల పట్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో-టాలరెన్స్ విధానం గత నాలుగు సంవత్సరాల్లో సానుకూల ఫలితాలను ఇచ్చింది. మార్చి 2021 లో ఉత్తర ప్రదేశ్‌లో దిగజారుతున్న శాంతిభద్రతలు అంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. జీరో టాలరెన్స్ విధానం తీసుకుని వచ్చిన తర్వాత భారీ స్థాయిలో క్రైమ్ రేట్ తగ్గిందని గణాంకాలతో సహా వెల్లడించారు. దీంతో ప్రతి పక్షాలు సైలెంట్ అయిపోయాయి. తన ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసిన విలేకరుల సమావేశంలో కూడా యోగి ఆదిత్యనాథ్ తగ్గిన క్రైమ్ రేట్ గురించి వివరించారు. .“ఇంతకు ముందు లాగా అసురక్షిత భావనతో రాష్ట్రానికి ఎవరూ రావడం లేదని.. గతంలో ఉన్న భయం ఇప్పుడు భయం లేదు” అని అన్నారు. నేరస్థులు, మాఫియా, శాంతికి హాని కలిగించే శక్తులపై కూడా మా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది అని యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇది దేశంలో కూడా ఒక ప్రమాణాన్ని నెలకొల్పింది అని ఆయన అన్నారు. నేరస్థుడు ఏ కులం, ఏ ప్రాంతం అన్నవి తాము చూడమని.. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు.