ఎన్నాళ్లూ ఆ చైనా బొమ్మలేనా.. భారత్ తయారీ కూడా చూడండి.. తెలిసో.. తెలియకో గతం అలా విదేశీ సరుకులతో నిండిపోయిందికానీ.. ఇకపై భవిష్యత్ అంతా మన ఉత్పత్తులే.. మన సొమ్ము మన దగ్గరే అంటోదీ కేంద్రం. ఇందుమూలంగా భారత్‌లో మొట్ట మొదటి వర్చువల్ ఇండియా టాయ్ ఫెయిర్‌కు భారత్ సిద్ధమైంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు వర్చువల్ వేదికగా టాయ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 11న టాయ్ ఫెయిర్ 2021 వెబ్‌సైట్‌ను కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయుష్ గోయెల్, రమేష్ పొఖ్రియాల్ ఆవిష్కరించారు. ప్రఖ్యాత టాయ్ సంస్థ హామ్లీ.. టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న టాయ్ ఫెయిర్‌లో పాల్గొనాలనుకునే పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, ఎగ్జిబిటర్లు ఈ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోచ్చు. భారత్‌లో తయారైన వేలాది రకాల ఆట బొమ్మలను ఈ ఫెయిర్‌లో వీక్షించవచ్చు.
టాయ్ ఫెయిర్ 2021లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. వెయ్యికి పైగా స్టాల్స్ లో లక్షల రకాల ఆటబొమ్మలను ప్రదర్శనకు ఉంచుతారు. బొమ్మల పరిశ్రమకు చెందిన ప్రముఖులతో వెబినార్లు, ప్యానెల్ డిస్కషన్స్, ఇతర యాక్టివిటీలు టాయ్ ఫెయిర్‌లు ఉంటాయి. అంతేకాదు టాయ్ బేస్డ్ లెర్నింగ్, క్విజ్‌లు, వర్చువల్ టూర్లు, కొత్త ఉత్పత్తుల లాంచింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నిజానికి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆటబొమ్మల్లో నాణ్యత లేదు.. అంతే కాదు వాటిలో హానికారక కెమికల్స్ కూడా మిక్స్ అయి ఉండటంతో పిల్లల ఆరోగ్యంపై దారుణమైన ప్రభావాలు చూపిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే 30 శాతం టాయ్స్ లో భార లోహాలు, హానికారక రసాయనాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. అంతేకాదు చౌక ధరలతో ఇండియన్ టాయ్ ఇండస్ట్రీని దెబ్బతింటోందని పలువురు వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే కేంద్రం ప్రారంభించనున్న ఈ టాయ్ ఫెయిర్ ద్వారా అందరికీ నాణ్యమైన బొమ్మలు లభిస్తాయి.
ఇక భారత్ లో తయారయ్యే ఆట బొమ్మలు పిల్లల్లో సంతోషం నింపుతున్నాయి. మన మైండ్ సెట్ కి తగ్గట్టుగా మన వాళ్లు తయారు చేసిన వస్తువులు మనం వాడటం వలన బాగుండేది మనమే కదా మరి.
పిల్లలకు నేటి కాలంలో రోజు వారి ఆన్లైన్ క్లాసులు, వీడియోగేమ్ ల మధ్య ఈ బొమ్మల ద్వారా నిజమైన ఆనందం లభించగలదు. కేవలం ఆట విడుపుగానే కాదు నాలెడ్జిని కూడా అందించగలవు. భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విద్యా విధానం కూడా ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. దీనివలన ఎంతో మంది ఆర్టిస్టులు, సూక్ష్మ వ్యాపారులకు జీవనాధారం కూడా లభించనుంది.
ఈ టాయ్ ఫెయిర్ విద్యాపరంగానూ విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న పలు అంశాలపై నాలెడ్జి సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్లే బేస్డ్, యాక్టివిటీ బేస్డ్, ఔట్‌డోర్ ప్లే, పజిల్, క్రిటికల్ థింకింగ్‌ను ప్రమోట్ చేసే గేమ్స్ గురించి అవగాహన కల్పించబోతున్నారు. ఇందులో NCERT, SCERT, CBSE, IIT-గాంధీనగర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ చిల్డ్రెన్ యూనివర్సిటీ భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ టాయ్ ఫెయిర్‌ను విజయంతం చేసేందుకు ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలు చేతులు కలిపాయని అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ”ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఈ టాయ్ ఫెయిర్ టాయ్ ఇండస్ట్రీకి బిగ్ బూస్ట్ ఇస్తుంది. ఈ కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్‌గా ఉంటుంది. టాయ్ ఇండస్ట్రీలో సమూల మార్పులు తేబోతోంది.” అని అని ఆమె తెలిపారు.