తొలిసారి ఆఫ్ఘాన్‎లో పర్యటన.. భారత్‎కు తాలిబన్ల విన్నపాలు..!

0
994

అమెరికా బలగాల నిష్క్రమణ.. తాలిబన్‌ పాలన చేపట్టాక అఫ్గనిస్థాన్‌లో భారత బృందం తొలిసారి పర్యటించింది. మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్‌ సెక్రెటరీ జేపీ సింగ్‌ నేతృత్వంలోని ఓ బృందం అఫ్గానిస్తాన్‌లో పర్యటిస్తోంది.

తాలిబన్ల చేతిలోకి వెళ్లాక భారత బృందం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. అఫ్గన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్‌, జేపీ సింగ్‌ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం భారత బృందం అక్కడి మంత్రితో భేటీ అయ్యింది. మానవతా సాయం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకుంది. అఫ్గానిస్థాన్ ను చేతుల్లోకి తీసుకుని, అధికారం చేపట్టిన తాలిబన్ ప్రభుత్వానికి చేయూత అందించాలని భారత్ ను అఫ్గాన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు భారత అధికారుల బృందం అఫ్గాన్ అధికారులతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై, అక్కడి ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంపై చర్చ జరిగింది.

తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ దేశంతో భారత్ ఏర్పరుచుకున్న సంబంధాలను తిరిగి కొనసాగించాలని అఫ్గాన్ ప్రతినిధులు కోరారు. ఇండియా చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి పునఃప్రారంభించడం, దౌత్యపరమైన కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం, అఫ్గాన్‌ విద్యార్థులు, రోగులకు దౌత్యపరమైన సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తమతో వాణిజ్యం కొనసాగించే విషయాన్నీ పరిశీలించాలని కోరారు. గతేడాది ఆగస్టు 15 తర్వాత అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. దీంతో అక్కడ ఉన్న భారత అధికారులందరు స్వదేశానికి వచ్చేశారు. అయినా ఇక్కడి నుంచే అఫ్గాన్ లో ఉన్న సిబ్బంది రాయబార కార్యాలయ నిర్వహణ చూసుకున్నారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ బంధాలు తమ విధానాన్ని కొనసాగించేందుకు దోహదపడుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాలిబన్ల సీనియర్‌ నాయకులతో భారత బృందం భేటీ అయ్యింది. అఫ్గాన్‌ ప్రజలకు భారత్‌ అందిస్తున్న సహాయాన్ని అందించడంపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

11 + 11 =