International

తాలిబాన్ ప్రభుత్వ హయాంలో కాబూల్ లో ల్యాండ్ అయిన తొలి విదేశీ విమానం.. ఎవరిదంటే..?

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడకు వెళ్ళడానికి ఏ విదేశీ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ పాకిస్తాన్ కు చెందిన విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తాలిబాన్లి అధికారం చేపట్టాక కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి అంతర్జాతీయ విమానంగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ గుర్తింపు తెచ్చుకుంది. పాక్ కు చెందిన విమానం కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానంలో 10 మంది వరకు ఉంటారని మీడియా సంస్థలు తెలిపాయి. వీరిలో చాలా మంది విమాన సిబ్బందే ఉండొచ్చని అభిప్రాయపడింది. గత వారాంతంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ కు రెగ్యులర్ గా కమర్షియల్ విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెప్పినట్టుగానే పాక్ నుంచి తొలి విమానం కాబూల్ కు చేరుకుంది.

గత నెలలో తాలిబాన్ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయ వాణిజ్య విమానం సోమవారం ఆఫ్ఘన్ రాజధానిలో ల్యాండ్ అయింది. కాబూల్ విమానాశ్రయం మునుపటిలా లేదు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు చాలా వరకూ దెబ్బతింది. ఖతార్ మరియు ఇతర దేశాల నుండి సాంకేతిక సహకారంతో తాలిబాన్లు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇస్లామాబాద్ నుండి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌వేస్ (పిఐఎ) ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఎఎఫ్‌పి జర్నలిస్ట్ మాట్లాడుతూ “విమానంలో ఎవరూ లేరు, దాదాపు 10 మంది ప్రయాణికుల కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండవచ్చు.” అని చెప్పుకొచ్చారు. మరో వైపు ప్రజలు దేశం విడిచిపెట్టి వెళ్లవద్దని తాలిబాన్లు కోరుతూ ఉన్నారు. మరో వైపు సరైన పత్రాలు కలిగిన ఆఫ్ఘన్లు దేశాన్ని స్వేచ్ఛగా విడిచి వెళ్లేందుకు అనుమతిస్తామని పదేపదే వాగ్దానం చేస్తున్నారు. ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న పరిస్థితులను చూసి ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయిన సంగతి తెలిసిందే..! దాదాపు లక్ష 20 వేల మందికి పైగా ప్రజలను అక్కడి నుండి తరలించారు. ఈ తరలింపు సమయంలో, పలు కారణాల వల్ల ఎయిర్ పోర్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆగస్టు 15 న తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించిన తర్వాత రోజుల్లో ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఘటనల కారణంగా ప్రయాణీకుల గదులు, ఎయిర్‌బ్రిడ్జిలు మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. నాటో దళాల ఉపసంహరణ సమయంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉపసంహరణ గడువుకు ముందే వేలాది మంది ఆఫ్ఘన్‌లను నాటో దేశాలు తరలించాయి.

ఇప్పుడు వాణిజ్య విమానాలు పునః ప్రారంభవమవడంతో ఆఫ్ఘన్ ను వీడడానికి కొందరు ప్రజలు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఖతార్ ఎయిర్‌వేస్ గత వారం కాబూల్ నుండి అనేక చార్టర్ ఫ్లైట్‌లను నడిపింది, తరలింపులో తప్పిపోయిన విదేశీయులు మరియు ఆఫ్ఘన్‌లను ఎక్కువగా తీసుకువెళ్లారు. సెప్టెంబర్ 3 న ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్ దేశీయ సేవలను తిరిగి ప్రారంభించింది. ఇక పాక్ విమానాలు తిరుగుతూ ఉండడంతో ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు దాదాపు 100 మంది ప్రయాణికులు వేచి ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 9 =

Back to top button