National

ఆ మందు తీసుకుని కోలుకున్న మొదటి వ్యక్తిగా నిలిచిన 84 సంవత్సరాల హర్యానా వాసి

మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కరోనా బారినపడినప్పుడు వేసుకున్న ముందుగా అంతర్జాతీయంగా పేరును తెచ్చుకుంది. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమే ఇది. యాంటీబాడీస్ కాక్‌టెయిల్ ఔషధాన్ని అమెరికాకు చెందిన రోచె సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ మెడిసిన్ భారత్ లో అందుబాటులోకి వచ్చేసింది.

ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును మన దేశంలో తొలిసారి వినియోగించారు. హర్యానాలో ఓ రోగికి ప్రయోగాత్మకంగా ఇవ్వగా అతడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. 84 సంవత్సరాల మొహబత్‌సింగ్ కి యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును ఇచ్చామని, ఆయన పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇంట్రావీనస్ సప్లై ద్వారా ఆ వ్యక్తికి 30 నిమిషాల పాటూ ఈ డ్రగ్స్ ఇచ్చినట్లు చైర్మన్ డాక్టర్ నరేశ్ తెహ్రాన్ తెలిపారు. ఈ ఔషధం బాగా పనిచేసిందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. గత 5 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడని.. ఈ ఔషధం ఇవ్వడంతో అతడి ఆరోగ్యం కుదుటపడిందని ఆయన తెలిపారు.

యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందు ఒక్కోడోసు ధర రూ. 59,750. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమని చెప్పొచ్చు. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు తెలిపారు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి. భారత్ లో ఈ యాంటీ బాడీ కాక్-టెయిల్ మందు అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతించింది. 1200 ఎంజీల డ్రగ్ లో ఒక్కొక్కటి 600 ఎంజీల కెసిరివిమాబ్, ఇంతే ఎంజీల ఇమ్ డెవి మాబ్ ఉంటాయని రోచె ఇండియా వెల్లడించింది. దీని గరిష్ట ధర లక్షా 19 వేల 500 రూపాయలని వివరించింది. ఒక్కో ప్యాక్ ఇద్దరు కోవిద్ రోగులకు సరిపోతుందని, ఇండియాలో దీని మెదటి బ్యాచ్ ని సిప్లా సంస్థ మార్కెట్ చేస్తుందని వెల్లడించింది. రెండో బ్యాచ్ జూన్ మధ్యకల్లా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ డ్రగ్ ను తీసుకునే వారి వయసు 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలని.. అలాగే 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండాలని తెలిపారు.

ఈ డ్రగ్ వాడిన 80 శాతం మందికి ఆసుపత్రుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం రాలేదని చెబుతున్నారు. రెమ్డెసివిర్ లేదా టోసిలిజుమాబ్ లకు ఈ ముందుకు చాలా తేడా ఉందని నిపుణులు తెలిపారు. మరణాల రేటును భారీగా తగ్గిస్తుందని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ప్రస్తుతానికి 65 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఈ డ్రగ్ ను ఇవ్వాలని సూచించిందట.. 55 సంవత్సరాల వయసు పైబడి హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు కూడా ఈ ఔషధాన్ని ఇవ్వొచ్చని భారత ప్రభుత్వం తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

9 + eighteen =

Back to top button