తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైతు హరిబాబు అరటితోటను కోశాక నిప్పు పెట్టాడు. దీంతో కరకట్టకు ఆనుకుని ఉన్న ఎండుగడ్డికి మంటలు అంటుకుంటున్నాయి. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తాడేపల్లి సీఐ సాంబశివరావు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సకాలంలో ఫైరింజన్ తో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో మంటలను అదుపు చేయగలిగారు.