రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాములో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. శాస్త్రీపురంలోని మీర్ అలం ఫిల్డర్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలను చూసి స్థానికులు భయబాంత్రులకు గురి అయ్యారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గోదాంలో నిలిపి ఉంచిన రెండు డీసీఎం వాహనాలు దగ్థం అయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేనట్లుగా తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం జరగడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.