More

    భారత పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం

    బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం 10 నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పివేశారని అధికారి తెలిపారు.

    అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పార్లమెంటు భవనం లోని గది నెంబర్ 59 వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ, ” చాలా చిన్న అగ్ని ప్రమాదమని.. 8.10 గంటలకు అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో కొన్ని టేబుళ్లు, కుర్చీలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది” అని అన్నారు. పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. అయితే సమావేశాలు ప్రారంభానికి ముందే ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది.

    పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రస్తుతం నవంబర్ 29 నుండి డిసెంబర్ 23 వరకు జరుగుతున్నాయి. ఈ సెషన్ దేశంలోని అగ్రనేతలందరూ హాజరవుతూ ఉంటారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పార్లమెంట్ వెలుపల అగ్నిమాపక యంత్రాన్ని ఎల్లప్పుడూ ఉంచినట్లు అధికారి తెలిపారు. వైర్‌లెస్ ద్వారా అగ్నిప్రమాదం గురించి సమాచారం అందింది. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories