మళ్లీ అవే కారుకూతలు..!
అయినా, ఒక్క కేసూ లేదు..!!

0
889

‘‘మర్చిపోకండి యూపీ పోలీసుల్లారా..! మీ ఆటలు సాగేది కొన్నాళ్లే..!! యోగి ఎల్లకాలం సీఎంగా వుండడు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండలేడు. ముస్లింలమైన మేం కొన్ని పరిస్థితుల వల్ల మౌనంగా వుంటున్నాం. కానీ, గుర్తుంచుకోండి.. మాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోం. అల్లా తన శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాడు. కాలం మారుతుంది. మాకూ టైమొస్తుంది. గుర్తుంచుకోండి ఒక్కసారి ముస్లిం ప్రభుత్వం ఏర్పడిందంటే.. మీ యోగి మఠానికి వెళ్లిపోతాడు. మీ మోదీ హిమాలయాలకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవడొస్తాడో చూస్తా’’. యూపీలో పోలీసులను హెచ్చరిస్తూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలివి. ఆయనే గతంలో రాముడిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బతుకమ్మను అవహేళన చేశాడు. ఒకటేమిటి అవకాశం వచ్చినప్పుడల్లా హిందువులను, హిందువుల మనోభావాలను, భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిపై విషం చిమ్మాడు. ఆయనెవరో ఇప్పటికే మీకు అర్థమైవుంటుంది. ఎస్.. అసదుద్దీన్ ఒవైసీ. నిజాం నిరంకుశత్వాన్ని బతికించాలని పరితపిస్తున్న ముస్లింల నాయకుడు.

ఇప్పుడు ప్రధానిని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళన చేయడమే కాదు.. ఆ రాష్ట్ర పోలీసులకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు అసదుద్దీన్ ఒవైసీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీలోని కాన్పూర్‎లో డిసెంబర్ 12న జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కానీ, ఆశ్చర్యకరమైన విషయమేటింటే.. ఏకంగా పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చినా.. అతనిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే ఒక సాధువో, స్వామీజీనో మాట్లాడితే మాత్రం ఆగమేఘాల మీద కేసులు పెడతారు. పెడతారేంటి..! పెట్టారు కూడా. కానీ, ఇటీవల ఉత్తరాఖండ్‎లో జరిగిన ధర్మ సంసద్‌లో చేసిన ప్రసంగాలకు వ్యతిరేకంగా ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్‎ను ఆధారంగా చేసుకుని.. యతి నర్సింగనాథ్, ఇతర హిందూ నాయకులపై కేసు నమోదు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. ఆశ్చర్యకరంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అసదుద్దీన్ ఒవైసీనే. కానీ, ఇప్పుడు అదే అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చినా.. ఒక్క కేసూ నమోదు కాలేదు.

ఇటీవల ఉత్తరాఖండ్‎లోని హరిద్వార్‌లో డిసెంబర్ 17 నుంచి మూడు రోజుల పాటు ధర్మసంసద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇటీవల హిందూమతం స్వీకరించిన వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.ఈ కార్యక్రమంలో చేసిన ప్రకటనలకు సంబంధించి పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, ఐపిసి సెక్షన్ 153A కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్వయంగా రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ధర్మసంసద్ ప్రసంగాలను వామపక్షవాదులు, ఇస్లాంవాదులు, విపరీతంగా వైరల్ చేశారు. మస్లింల మారణహోమానికి హిందూ నాయకులు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేశారు. కానీ, అసదుద్దీన్ ఒవైసీ పరుష వ్యాఖ్యలపై మాత్రం ఒక్కడూ స్పందించ లేదు. కుహనా లౌకివాదులు, వామపక్షవాదుల నోళ్లు పెకలలేదు.

ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిథి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ.. హరిద్వార్ ధర్మసంసద్‌లో ఏది జరిగినా అది తప్పేనని అన్నారు. పోలీసులు సంబంధిత బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. మరి యూపీలో పోలీసులుకు మాత్రం అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎందుకు తప్పనిపించలేదో మరి..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =