More

    డ్యాన్స్ చేస్తూ.. మందు తాగుతూ రచ్చ చేసిన ప్రధాని.. వీడియో వైరల్ అవ్వడంతో..!

    ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌.. అతి చిన్న వయసులోనే ప్రధాని అయ్యారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ప్రైవేట్ పార్టీలలో డ్యాన్స్ చేయడం, పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె కలత చెందినట్లు సమాచారం. పిఎం మారిన్ చిత్రాలను తన సన్నిహితుల వరకు మాత్రమే పరిమితం చేయగా.. ఈ చిత్రాల లీక్ చేయడం వల్ల ఆమె గోప్యతకు అంతరాయం ఏర్పడింది. ఫిన్లాండ్‌కు చెందిన 36 ఏళ్ల నాయకురాలు.. పాటలు పాడుతూ నృత్యం చేసిన రెండు నిమిషాల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో మొదట్లో ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారని తెలుస్తోంది. అయితే ఆ వీడియో క్లిప్‌లు ఇతర ఖాతాల ద్వారా వైరల్ అయ్యాయి.

    ఈ వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి. తనపై వస్తున్న ఈ వార్తలపై మారిన్ స్పందించారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. వీడియో రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని.. వీడియో బయటకు రావడం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు. అది చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. ప్రైవేటు వీడియో లీక్ కావడం మాత్రం దురదృష్టకరమన్నారు. ఆ వీడియోను లీక్ చేసిన వ్యక్తి ఎవరనేది మారిన్‌కు తెలియదు. చాలా మంది పౌరులు ఆ దేశ ప్రధానమంత్రి ప్రైవసీని గౌరవించాలని ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆమెకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories