భారతీయ స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే..! రకరకాల వంటకాలు లభిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన, ఇష్టమైనవి ఎన్నో రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో సమోసా కూడా ఒకటి. సమోసా ఏ సందర్భంలోనైనా తినగలిగే ఆహారాలలో ఒకటి. సమోసాలకు విపరీతమైన ప్రజాదరణ కూడా ఉంటుంది. సమోసాలలో వెజ్, నాన్ వెజ్ సమోసాలు కూడా ఉంటాయి. ఆలూ, క్యారెట్, పనీర్,చికెన్.. ఇలా ఎన్నో వెరైటీలు మీకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి.
మీరు ఎప్పుడైనా భారీ మూడు కిలోల సమోసాను చూసారా…? సమోసాలో చిన్న సమోసా.. పెద్ద సమోసా గురించి తెలుసు కానీ.. ఏకంగా మూడు కేజీల సమోసా గురించి చాలా తక్కువ మందికే.. తినడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ సమోసాను పూర్తిగా తింటే మంచి ప్రైజ్ మనీ కూడా మీ సొంతమే..!
యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ Foody Vishal వీడియోను అప్లోడ్ చేశారు. పెద్ద సమోసాను తయారు చేయడం వీడియోలో చూడవచ్చు. పిండి తీసుకోవడం దగ్గర నుండి బాగా ఆయిల్ లో వేయించే వరకూ చూడవచ్చు. అయితే ఈ సమోసాను 5 నిమిషాల్లో తినేస్తే 11000 రూపాయలు ఇస్తామని ఆ సమోసా తయారీదారు వెల్లడించారు. వీడియోలో గౌరవ్ ఖురానా అనే వ్యక్తి ఈ ఛాలెంజ్ ను స్వీకరించి.. 4 నిమిషాల 51 సెకండ్లలో పూర్తీ చేశారు. వెంటనే అతడికి క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. విశాల్ ప్రకారం.. ఈ సమోసాను డిల్లీ 6 లోని మషూర్ బెడ్మీ పూరీ సబ్జీ చోలే భతురే, సాహిబాబాద్, ఘజియాబాద్(Dilli 6 Ki Mashoor Bedmi Puri Sabzi Chole Bhature , Sahibabad, Ghaziabad) లో తినవచ్చు. సమోసా ధర 500 రూపాయలు.