More

    కొత్త సినిమాతో వస్తున్న కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు.. కంటెంట్ ఏమిటంటే..?

    కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం సృష్టించినబాలీవుడ్ డైరెక్టర్ కొత్త సినిమాతో అందరి ముందుకు వస్తున్నారు. కశ్మీరీ ఫైల్స్ తర్వాత తన కొత్త ప్రాజెక్టు వివరాలను వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రకటించారు. కరోనా టీకా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. ‘మనకు తెలియని యుద్ధంలో పోరాడాం. చివరకు గెలిచాం’ అని ఈ పోస్టుకు వివేక్‌ రంజన్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ పేరుతో రాబోతున్న సినిమా పోస్టర్ ను వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని హిందీతో పాటు తెలుగు, మరాఠీ, తమిళ, కన్నడ సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

    మహమ్మారి సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే రేసులో భారతదేశం తీసుకున్న చర్యల చుట్టూ వ్యాక్సిన్ వార్ సినిమా కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమా మొత్తం షూటింగ్‌ని లక్నోలో ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories