‘ది కేరళ స్టోరీ’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న పేరిది. ఏ మొబైల్లో చూసినా.. ఏ వాట్సాప్ గ్రూపులో చూసినా.. ఈ సినిమా టీజరే దర్శనమిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచార చిత్రం దూసుకుపోతోంది. కొన్ని రోజుల్లోనే లక్షల్లో లైకులు, షేర్లతో భారీగా వైరల్ అయింది. ఇదే సమయంలో ఈ సినిమా టీజర్‌ను కొంతమంది సోకాల్డ్ సెక్యులర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నిషేధించాలంటూ కేసులు పెడుతున్నారు. అయితే ఈ టీజర్ చూడగానే ఉదారవాదులకు అంతగా కోపం ఎందుకు వస్తోంది..? అసలు ఈ సినిమా ప్రత్యేకతలేంటి..? ఎప్పుడు రిలీజ్ కాబోతోంది..? ఈ వివరాలు తెలియాలంటే.. టీజర్‌పై ఓ లుక్కేయాలి..?
53 సెకన్లు నిడివిగల ఈ సినిమా టీజర్.. బాలీవుడ్ నటి ఆదా శర్మ వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. తన పేరు ‘షాలినీ ఉన్ని కృష్ణన్’ అని.. తాను నర్సుగా మారి దేశ ప్రజలకు సేవ చేయాలని అనుకునేదాన్నని చెబుతుంది. కానీ, తర్వాత తాను ‘ఫాతిమా బా’ గా మారిపోయాననీ,.. ఇప్పుడు తాను ఒక ఐసిస్ టెర్రరిస్టునని.. అఫ్గానిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఉన్నది తానొక్కదాన్నే కాదనీ, తనలాగే దాదాపు 32 వేల మంది మహిళలు మతం మారి.. సిరియా, యెమెన్ దేశాల్లో ఉగ్రవాదానికి బలయ్యారని కన్నీటి పర్యంతమవుతుంది. కేరళలో సాధారణ మహిళలను కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చే దారుణమైన క్రీడ బహిరంగంగానే జరుగుతుందని చెబుతూ.. ఈ దారుణాన్ని ఆపేవారే లేరా అంటూ ప్రశ్నిస్తుంది. తనలాంటి 32 వేల మంది చరిత్రే ‘ది కేరళ స్టోరీ’ అంటూ ముగిస్తుంది ‘ఫాతిమా బా’ అలియాస్ ‘షాలినీ ఉన్ని కృష్ణన్’.
ఇటీవలే విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ టీజర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే అన్నిటినీ వ్యతిరేకించే సోకాల్డ్ సెక్యులర్లు.. ఈ సినిమాపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. ఈ సినిమా కేరళ గౌరవాన్ని భంగపరిచేలా ఉందని.. ఇందులో చెప్పిన లెక్కలు కూడా పూర్తి అవాస్తవాలని రచ్చకెక్కారు. అంతటితో ఆగకుండా ఈ సినిమా నిర్మాణాన్ని ఆపాలంటూ పినరయ్ విజయన్‌కు.. ఓ జర్నలిస్టు లేఖ రాశాడు. దీంతో రాష్ట్ర డీజీపీ చర్యలు మొదలుపెట్టారు. ఈ సినిమాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా.. తిరువనంతపురం పోలీస్ కమిషనర్ ‘స్పర్జన్ కుమార్’ను కోరారు. దీంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా సినిమాపై విరుచుకుపడింది. ఈ సినిమా పూర్తిగా ఆరెస్సెస్ భావజాలంతో తీసారని.. దీన్ని విడుదల కాకుండా తక్షణమే నిలిపివేయాలని కేరళ కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ డిమాండ్ చేశారు. టీజర్లో చెప్పిన లెక్కలన్నీ పూర్తి అవాస్తవాలని దుయ్యబట్టారు. అయితే వీడియోలో ఉన్న 32 వేల మంది లెక్కల మాట అటుంచితే.. కేరళలో నిజంగా ఇటువంటి దారుణాలు జరిగాయా..? అనే విషయంపై మాట్లాడుకుందాం.
కేరళ అంటేనే హిందూ దేవాలయాలకు స్వర్గధామం. అందుకే ఈ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని కూడా అంటారు. కానీ,.. కాలక్రమేణా కేరళ భారీ మతమార్పిడులకు గురయ్యింది. హిందూ ధర్మం నుంచి క్రిస్టియానిటీ, ముస్లిం మతాల్లోకి బలవంతపు మతమార్పిడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో కేరళలో తమ పట్టు నిలుపుకోవడానికి ఇస్లామిక్ సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని విస్తరించాయి. ఇతర మతాల్లోని అమ్మాయిలకు జీహాద్ పేరిట వల వేసి మతమార్పిడులకు పాల్పడ్డాయి. దీనికి విదేశీ ఉగ్రవాద సంస్థలు భారీగా నిధులు సమకూర్చడంతో కేరళ వ్యాప్తంగా ‘లవ్ జిహాద్’ వెర్రితలలు వేసింది. ఇందుకు రాష్ట్రంలో పీఎఫ్ఐ, ఎస్డీపీఐ లాంటి సంస్థలు బాగా సహకరించాయి. జీహాదీ భావజాలంతో విద్యార్థినుల మెదళ్లను కలుషితం చేయడంలో పీఎఫ్ఐ బాగా ఉపయోగపడింది. దీంతో అమాయక విద్యార్థినులు ఈ భావజాలానికి త్వరగా ఆకర్షితులయ్యారు.
అంతేకాదు, ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు.. హిందూ మతంలో ఒక్కో కులానికి ఒక్కో ధర నిర్ణయించి.. ముస్లిం యువకులను లవ్ జిహాద్ కు ఉసిగొల్పుతారు. హిందూ బాలికలను ఏమార్చి పెళ్లి చేసుకున్న యువకులకు నిర్ణయించిన ధరను బహుమతిగా అందజేస్తారు. ఈ డబ్బుకు ఆశపడ్డ ముస్లిం యువకులు హిందూ, క్రిస్టియన్ బాలికలను మతమార్పిడి చేసి పెళ్ళి చేసుకుంటారు. అయితే ఇలా పెళ్ళి చేసుకున్న అమ్మాయిలను అఫ్గానిస్తాన్, సిరియా, యెమెన్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థల్లో చేర్పించి ఉగ్రవాదులకు బానిసలుగా మారుస్తారు. దీంతో అప్పటివరకు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతులు లవ్ జీహాద్ ఉచ్చులో పడి ఉగ్రవాదులకు బానిసలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరిని ఉగ్రవాదులు అతి కిరాతకంగా హింసిస్తారు. వారిపై ప్రతిరోజూ అత్యాచారాలకు పాల్పడతారు. ఇక, ఆ దేశాల్లోని ప్రభుత్వాలకు పట్టుబడినప్పుడు వారిని జైళ్ళకు తరలించి జీవితాంతం ఆ జైళ్ళలోనే మగ్గేలా చేస్తారు. ఇటువంటి వారిని భారత్ కూడా అంగీకరించదు. ఒకవేళ వీరిని భారత ప్రభుత్వం విడిపించుకుని వచ్చినా కూడా.. అప్పటికే ఉగ్రవాద భావజాలంతో ఉన్నవారు సమాజానికి మరింత నష్టం చేకూరుస్తారనే భావనతో ప్రభుత్వాలు కూడా వీరిని పట్టించుకోవు.
ఇలాంటి లవ్ జిహాద్ ఘటనలపై ప్రభుత్వాల వద్ద అధికారిక లెక్కలు కూడా ఉన్నాయి. దీనిపై కేవలం హిందూ సంస్థలే కాకుండా సైరో మలబార్ చర్చి, కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ లు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. 2016లో మినీ విజయన్ అనే మిలటరీ అధికారి తన కూతురిని బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేశారని ఆరోపించారు. అదే సంవత్సరం కేరళలో పీస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ లో పనిచేస్తున్న అబ్దుల్ రషీద్, అతని భార్య సోనియా సెబాస్టియన్ అలియాస్ అయేషాలు కలిసి.. ఏకంగా 22 మందిని మతమార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా 2011 నుంచి 2015 వరకు దాదాపు 5,975 మందిని మతమార్పిడి చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కేవలం 2015 లోనే 1410 మంది మతమార్పిడికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ 76 శాతం మంది మహిళలు కేవలం 35 ఏళ్ళలోపు వయసున్నవారే. ఇక మరో కేసులో అర్షీద్ ఖురేషీ అనే వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఉన్న ఇతడిని అరెస్టు చేసి విచారించగా.. దాదాపు 800 మంది యువతులను మతం మార్చినట్లు అంగీకరించాడు. ఇక ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో కూడా కేరళలో ఐసిస్ రిక్రూట్మెంట్లు బలంగా జరుగుతున్నాయని వెల్లడైంది. అయితే ఈ మతమార్పిడులు ఏ రేంజిలో జరుగుతున్నాయన్నదానిపై కచ్చితమైన లెక్కలేమీ లేవు. ఉగ్రవాద సంస్థల్లో చేరినవారి గురించిన వివరాలు ప్రభుత్వాలకు సరిగ్గా తెలియకపోవడంతో ఇవి మరింత ఎక్కువ సంఖ్యలో జరిగి ఉండొచ్చనే అంచనాలున్నాయి.
ఈ విషయాలను ఆధారంగా చేసుకుని ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. కేరళలోని ఉగ్రవాదుల మతమార్పిడి గురించిన కచ్చితమైన లెక్కలు లేకపోవడంతో సరాసరి లెక్కగా 32 వేలుగా చూపినట్లు అర్థమవుతోంది. అయితే ఉదారవాదులంతా అది కచ్చితమైన లెక్క కాదనే చెబుతున్నారు. కానీ,.. లవ్ జీహాద్ పేరిట హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఉగ్రవాదులుగా మారుస్తున్న దారుణాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. అదీ మన దౌర్భాగ్యం. గతంలో కూడా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వీరంతా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా,.. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్ళు రాబట్టింది. దీంతో ‘ది కేరళ స్టోరీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి, ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందనే విషయం తెలియాలంటే, మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే, ‘ది కేరళ స్టోరీ’ నవంబర్ చివర్లో గానీ, డిసెంబర్ లో లేదా 2023 జనవరిలో గానీ విడుదల కానుంది.