More

    పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయిన యుద్ధ విమానం

    నవంబరు 16న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు ఆదివారం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై విమానాలను ల్యాండ్ చేయించారు. భారీ C-130 సూపర్ హెర్క్యులస్ విమానం, తరువాత ఒక యుద్ధ విమానం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయ్యాడు. వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎమ్‌కెఐ, సి-130 జె సూపర్ హెర్క్యులస్ వంటి విమానాలు నవంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ల్యాండ్ కానున్నాయి. సుఖోయ్ మరియు రాఫెల్ ఫైటర్ జెట్‌లు వెంటనే బయలుదేరడానికి ఎక్స్‌ప్రెస్‌వేలో టచ్ అండ్ గో ఆపరేషన్‌లు నిర్వహించనున్నారు. యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి, ఎగరడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పలుమార్లు ఆయా ప్రాంతాలను తనిఖీలు చేశారు.

    నవంబర్ 16, మంగళవారం నాడు 42,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల పూర్వాంచల్ నుండి లక్నో మధ్య అనేక నగరాల ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రధాని మోదీ ప్రారంభించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మంగళవారం ఈవెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. ఎయిర్‌స్ట్రిప్‌కి దిగువన ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై దిగేందుకు ఆకర్షణీయమైన మెట్లను తయారు చేయబడ్డాయి. స్ట్రిప్‌కు ఇరువైపులా సర్వీస్ లేన్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఘాజీపూర్‌-లక్నో మధ్య 354 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. దీన్ని బల్లియా వరకు పొడిగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

    Trending Stories

    Related Stories