More

  ఫిఫా ప్రపంచ కప్ లో భారత్ ఎందుకు ఆడడం లేదు..?

  ఫిఫా వరల్డ్ కప్‌ 2022 పోటీలు నవంబర్‌ 20 నుండి మొదలయ్యాయి. అరబ్ దేశమైన ఖతర్‌ వేధికగా నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు ఈ క్రీడా సంగ్రామం జరగనుంది. ఈ ఫుట్‌బాల్ ఆటలో భారత్ మాత్రం వెనుకబడే ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్.. ఇప్పటి వరకు ఒక్క ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ కూడా ఆడలేదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రికెట్ కంటే ఫుట్ బాల్ నే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. కానీ భారత్ మాత్రం ఫుట్ బాల్ లో పెద్దగా రాణించడం లేదు. భారత్ మొత్తం క్రికెట్ చుట్టూ తిరుగుతూ ఉండడంతో ఫుట్ బాల్ కు కనీసంమద్దతు దక్కడం లేదు. ఇది భారత క్రీడాభిమానులను బాధపెట్టే అంశం. ర్యాంకింగ్స్ పరంగా భారత్ చాలా దారుణమైన స్థితిలో ఉండడం.. ప్రపంచ కప్ కు క్వాలిఫైయింగ్ గా నిర్వహించే టోర్నమెంట్ లలో పెద్దగా సత్తా చాటకపోవడం కూడా భారత్ కు ప్రపంచ కప్ లో ఆడే అవకాశాలను దూరం చేస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు బయటకు వస్తూ ఉండడం.. ఐఎస్ఎల్ వంటివి నిర్వహిస్తూ ఉండడంతో భారత్ లో ఫుట్ బాల్ కు ఆదరణ దక్కుతోంది.

  అయితే ఒకసారి భారత్‌కు ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడే అవకాశం వచ్చినా.. ఆడలేకపోయింది. 72 ఏళ్ల క్రితం 1950లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం భారత ఫుట్‌బాల్ జట్టుకు వచ్చింది. కానీ, ఆడలేదు. 1950లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం భారత ఫుట్‌బాల్ జట్టుకు వచ్చినప్పటికీ ఆడలేదు. క్వాలిఫైయింగ్ రౌండ్‌ విధానంలో జరిగిన 1950 బ్రెజిల్ ప్రపంచకప్‌ జరగగా.. గ్రూప్ 10లో ఉన్న భారత్ నేరుగా అర్హత సాధించింది. క్వాలిఫైయింగ్ గ్రూప్‌లో ఉన్న ఫిలిప్పీన్స్‌తో పాటు, బర్మా టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే క్వాలిఫై అయ్యింది. పూల్-3లో ఇటలీ, పరాగ్వేతో పాటు భారత్‌కు అవకాశం దక్కింది. అప్పట్లో ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనకపోవడానికి రకరకాల కారణాలు ప్రచారం జరిగాయి. భారత ఆటగాళ్లకు షూస్ లేకపోవడంతో ఫిఫా అనుమతించలేదనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

  అయితే భారత్ లో ఎప్పటి నుండో ఫుట్ బాల్ ఆడేవారు. 1948 లండన్ ఒలింపిక్ క్రీడలలో భారత జట్టు సత్తా చాటుకుంది. ఫ్రాన్స్ లాంటి జట్టు చేతిలో 1-2 తేడాతో ఓడిపోయినప్పటికీ, భారత్ ఆడిన ఆటతీరుపై మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ ఎందుకనో కాల క్రమేణా ఫుట్ బాల్ కు భారత్ లో ఆదరణ దక్కలేదు. టాలెంటెడ్ ఆటగాళ్లకు కనీసం గుర్తింపు దక్కలేదు.

  Trending Stories

  Related Stories