తాలిబాన్లకు-పాక్ సైన్యానికి భీకర ఘర్షణలు.. పాక్ హెలికాఫ్టర్ కూల్చివేత

0
696

శుక్రవారం డురాండ్ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్రమయ్యాయి. తాజా ఘర్షణల కారణంగా ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి నిమోజ్ సెక్టార్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్‌ను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు శుక్రవారం కూల్చివేశారు. దీంతో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తీవ్ర మలుపు తీసుకున్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి నిమ్రోజ్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ హెలికాప్టర్‌ను తాలిబాన్ దళాలు కూల్చివేసినట్లు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన యుఎస్ జర్నలిస్ట్ హషీమ్ వహదత్యార్ వెల్లడించారు.

పాకిస్థాన్ హెలికాప్టర్‌పై తాలిబాన్ల దాడిలో పాక్ ఆర్మీ జనరల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిని రాబోయే 24 గంటల్లో అప్పగించాలని పాకిస్తాన్ సైన్యం తాలిబాన్‌లకు తెలిపింది. తాలిబాన్ పాక్ అభ్యర్థనను తిరస్కరించింది. దాడి చేసిన వారిని అప్పగించాలన్న పాక్ అభ్యర్థనను తాలిబాన్ తిరస్కరించడంతో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో పాక్‌ పై దాడులకు అఫ్ఘానిస్తాన్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పాకిస్తాన్ ఆర్మీ, తాలిబాన్ల మధ్య ఇలాంటి కాల్పుల ఘటనలు గత కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, కునార్‌లోని డంగామ్ జిల్లాలో తాలిబాన్ దళాలపై కాల్పులు జరిపింది పాక్ సైన్యం. దీంతో ఇరు వర్గాలు పోరాడుకున్నాయి.పాక్ సైన్యం కూడా తాలిబాన్లపై భారీగా ఆయుధాలను ఉపయోగించి దాడులకు పాల్పడింది. శాంతి కోసం పాకిస్తాన్ సైన్యంతో తాలిబాన్ దళాలు ఈ ప్రాంతంలో సమావేశమయ్యాయి.

డిసెంబర్ 2021లో, కునార్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ లైన్ వెంబడి పెద్ద ఘర్షణ జరిగింది. గతేడాది డిసెంబర్‌లో సరిహద్దు ప్రాంతాలతో పాటు ఇరువైపులా భారీగా కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. డ్యూరాండ్ లైన్ తాలిబాన్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణ కేంద్రంగా ఉంది. డిసెంబర్ 2021లో, నిమ్రోజ్ సెక్టార్‌లో పాకిస్తాన్ తన వైపు కంచె వేయడాన్ని తాలిబాన్ వ్యతిరేకించింది.