స్నేహితుల ముందు తిట్టిన నాన్న.. ఆ అమ్మాయి

0
726

చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసినా, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకున్నా.. ప్రతి ఒక్కరూ బాధపడాల్సి ఉంటుంది. కొందరి జీవితాల్లో అలాంటి ఘటనలు తీరని వేదనను మిగిల్చి పోతాయి. తల్లిదండ్రులు అన్నాక చిన్న పాటి మందలింపులు, తిట్టడం సహజం. కానీ తల్లిదండ్రులకు తమపై ఇష్టం లేక అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. పిల్లల మంచి కోసమే తల్లిదండ్రులు ఏవైనా చేస్తారు/చెప్తారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల ముందే ఓ వ్యక్తి తన కుమార్తెను తిట్టాడు. దీంతో ఆ బాలిక కాస్తా ఇంటికి వచ్చి విషం తినేసింది. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఉదయ్‌పూర్ జిల్లాలోని ఫలాసియాలోని బిచ్చివారాలో చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

బాలిక బిచ్చివారా సీనియర్‌ స్కూల్‌లో చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 22, 2022న, ఆమెకు హిందీ ప్రీ-బోర్డ్ పేపర్ ఉంది. ఆ సమయంలో ఆమె వద్ద ఓ స్లిప్ దొరికింది. ఆమెపై కాపీ కొట్టిందనే నింద మోపబడింది. ఆ తర్వాత అదే స్కూల్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న బాలిక తండ్రి హేమ్‌రాజ్‌ అందరి ముందు ఆమెను తిట్టాడు. ఇంటికి చేరుకున్న బాలిక మనస్తాపానికి గురై విషపూరితమైన పదార్థాన్ని సేవించి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం బాలిక మరణవార్త అందుకున్న అధికారులు కూడా పాఠశాలకు చేరుకుని జరిగిన ఘటనలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.