More

    చనిపోయాడని 11 మంది వైద్యులు ధృవీకరించారు.. చితికి నిప్పంటించే సమయంలో ఒక్కసారిగా..!

    దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఓ వృద్ధుడు మృతి చెందాడని భావిస్తూ అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంత్యక్రియలకు ముందు ఆ వృద్ధుడు ఒక్కసారిగా కళ్లు తెరిచాడు. చితిపై ఉంచడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు లేచి కూర్చున్నాడు. నరేలాలోని తిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల సతీష్ భరద్వాజ్ ఆదివారం ఉదయం కన్నుమూశాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణానంతరం, మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు కూడా తీసుకెళ్లారు.

    చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచి ఇక్కడెందుకున్నానని బంధువులను ప్రశ్నించాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఓ ఆసుపత్రిలో కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సతీశ్ భరద్వాజ్ (62) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడని ఏకంగా 11 మంది వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పు అంటించడానికి ముందు నోట్లో గంగాజలం పోశారు. ఆ నీళ్లు నోట్లో పడిన వెంటనే వృద్ధుడిలో కదలిక కనిపించింది. ఆ వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు.

    అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శ్మశానవాటిక వద్దకు వచ్చిన వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆ వెంటనే తేరుకుని అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఆపై నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ సాధారణంగా ఉందని, గుండె మామూలుగానే కొట్టుకుంటోందని తెలిపారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

    Trending Stories

    Related Stories