Telugu States

కేసీఆర్ ను క్షమించమంటూ ఈటల లేఖ ‘ఫేక్’.. పోలీసులను ఆశ్రయించిన బీజేపీ

ఈటల రాజేందర్ పొలిటికల్ జర్నీలో ఇటీవల ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కింద ఒక బానిసలా బ్రతకలేనంటూ ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడారు. ఇక హుజూరాబాద్ లో ఉప ఎన్నికలకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇటీవల కేసీఆర్ ను క్షమించమని కోరుతూ ఈటల రాజేందర్ కొద్దిరోజుల కిందట ఓ లేఖ రాశారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ లెటర్ వైరల్ అయింది. ఆ లేఖలో ఈటల రాజేందర్ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లుగా.. ఇకపై అలాంటి తప్పును చేయబోనని చెప్పడం కూడా ఉంది. టీఆర్‌ఎస్‌లో 20 ఏళ్లుగా తమ్ముడిలా చూసుకున్నారు. రాజకీయంగా అవకాశం ఇచ్చి మంత్రి స్థాయికి తీసుకెళ్లారని అందులో ఉంది. నేను చేసిన కొన్ని పనులు తప్పే.. కానీ.. కొందరు వ్యక్తుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా తప్పులను పెద్ద మనసుతో నన్ను తమ్ముడిగా భావించి క్షమించండి అంటూ ఆ లేఖలో ఉంది. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెపుతూ రాసిన లేఖ అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.

కేసీఆర్‌కు ఈటల లేఖ కలకలం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈటల వర్గీయులు

కొందరు టీఆర్ఎస్ నాయకులు ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఈ ఫేక్ లెటర్ పై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇదొక ఫేక్ ఫోటో అని బీజేపీ చెబుతోంది. ఈటల రాజేందర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు నకిలీ లేఖ తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని టీఆర్ఎస్ నాయకుడు సాధవరెడ్డిపై వీణవంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈటలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ లేఖను రూపొందించిన వారితో పాటు దానిని వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా పుట్టించారంటూ కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈటల ఎప్పుడూ తన లెటర్ ‌ప్యాడ్‌పై తెలుగులో ఏ విషయాన్నీ రాయలేదని బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × two =

Back to top button