More

    ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్.. అందులో ఏమేమి పోస్టు చేశారంటే

    ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ కలకలం రేపింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారు. ఆ ఎఫ్‌బీ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అందరినీ అప్రమత్తం చేశారు.

    ఆయన మాట్లాడుతూ, తన పేరు మీద ఎవరో ఫేక్ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారని తెలిపారు. డీపీగా ఒక అమ్మాయి ఫొటో పెట్టారని మండిపడ్డారు. అమ్మాయిల ఫొటోలు పెట్టి తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫేస్ బుక్ ఐడీ తనది కాదని… ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘నా పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారు. ఈ ఫేస్ బుక్ డీపీ గా అమ్మాయి ఫోటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫోటోలు పెట్టి నా పేరును డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను దీనిపై సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నా పేరుతో కొత్తగా క్రియేట్ చేసిన ఫేస్ బుక్ ఐడీ నాది కాదు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతూ ఉండగా.. ఇప్పుడు ఇలా ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories