National

అసలు అక్కడ జరిగిందేమిటి..?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాట్ జిల్లాలో ఒక పోలీసు అధికారి మహిళపై దురుసుగా ప్రవర్తించాడని, దాడి చేశాడని అంటూ శనివారం (జూలై 17) రాత్రి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అఖిలేష్ యాదవ్ తప్పుదోవ పట్టించే చిత్రాన్ని ట్వీట్ చేశారు. “బిజెపి ఆదేశాల మేరకు పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు ఉత్తర ప్రదేశ్ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. బిజెపి పాలనలో అన్యాయానికి కొరత లేదు. ఈ ఘటన అత్యంత ఖండించదగినది. ” అంటూ అఖిలేష్ యాదవ్ ఓ ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో ఒక పోలీసు మహిళ మీద కూర్చుని ఉండగా.. ఆమెపై దాడి చేస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉంది. కొన్ని మీడియా సంస్థలు అఖిలేష్ యాదవ్ చెప్పిందే నిజం అన్నట్లుగా కథనాలను ప్రసారం చేశాయి.

అయితే ఈ కథనంలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. తప్పుడు వార్తను అఖిలేష్ యాదవ్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారి మీద మహిళ దూసుకువెళ్లింది. అతడికి అపకీర్తి తీసుకుని రావడానికి ప్రయత్నించింది. కాన్పూర్ దేహాట్ పోలీసులు అఖిలేష్ యాదవ్ ట్వీట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వ్రాతపూర్వక , వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రధాన స్రవంతి మీడియా పోర్టల్స్ అఖిలేష్ యాదవ్ యొక్క అబద్ధాలను మరింత ప్రచారం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. అసలైన నిజం తెలియకుండా ఫోటోలను పోస్టు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన వెనుక నిజం:
కాన్పూర్ దేహాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ ఇన్‌చార్జి (భోగ్నిపూర్ పోలీస్ స్టేషన్) మహేంద్ర పటేల్ శివ యాదవ్‌ను పట్టుకోవటానికి దుర్గాదాస్‌పూర్ గ్రామానికి వెళ్లారు. నిందితుడు పంచాయతీ ఎన్నికల్లో ఓ అభ్యర్థిని బెదిరించాడని ఫిర్యాదు అందడంతో శివ యాదవ్ ను పట్టుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో నిందితుడి భార్య, తల్లి జోక్యం చేసుకుని యాదవ్‌ను అరెస్టు చేయనివ్వకుండా రక్షించారు. నిందితుడి భార్య ఆర్తి యాదవ్ పోలీసు మహేంద్ర పటేల్‌ కాలర్ ను పట్టుకుని నేలమీదకు లాగారు. ఈ ఘటనలో పోలీసుది ఎటువంటి తప్పు లేదు.

https://twitter.com/yadavakhilesh/status/141642760903493632

@isinghDeepanshu అనే ట్విట్టర్ యూజర్ ఈ సంఘటన యొక్క 8-సెకన్ల వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో పోలీసు అధికారిని పట్టుకుని ఆ మహిళ మెడ దగ్గర పట్టుకుని లాగడం స్పష్టంగా తెలుస్తోంది. కాన్పూర్ దేహాట్ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఇలాంటి వీడియోను షేర్ చేసింది. మరొక వీడియోలో పోలీసు అధికారిని ఇరికించే ప్రయత్నంలో ఆ మహిళ తన జాకెట్టును తీసే ప్రయత్నం చేసింది. ఒక వ్యక్తి కూడా పోలీసులను రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. అతను దూకుడుగా అక్కడ నిలబడ్డాడు. అక్కడ చోటు చేసుకుంది ఒక ఘటన అయితే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన విషయం మరొకటి. మహిళ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదు.. మహిళ మీద సదరు పోలీసు ఆఫీసర్ కూర్చోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

three × 4 =

Back to top button