More

    పాము అరుస్తున్న వీడియో.. నిజం తెలుసుకున్న పోలీసులు ఏమి చేశారంటే

    పాము అరుస్తోందంటూ ఓ వీడియో గత కొద్దిరోజులుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే..! పాము చూడ్డానికి విభిన్నంగా కనిపిస్తోందని.. నోరు తెరిస్తే విచిత్ర అరుపులు బయటికి వస్తున్నాయని తెగ షేర్ చేశారు. కరీంనగర్ లోని ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తోందని.. స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

    ఈ వీడియో ఫేక్ అని పోలీసులు మీడియాకు తెలిపారు. మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో ‘హోంగోస్‌ హిట్స్‌ ద హై నోట్స్‌’ అనే పేరుతో అప్‌లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఓ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు. సదరు యువకుడిని విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు.

    లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వీడియోకు వాయిస్ పెట్టి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశాడు. దీంతో నిజమని నమ్మిన కొందరు షేర్ చేయడం మొదలు పెట్టారు. కొందరైతే భయాందోళనలకు గురయ్యారు. దీంతో లింగంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను ఎడిట్ చేశానని పోలీసుల ముందు శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. ఇంటి పక్కన యువకులు క్రికెట్ ఆడుతూ ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారని.. వారిని భయపెట్టడానికి తాను ఇలా వీడియోను చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇలాంటి ఫేక్ వీడియోలను పోస్టు చేస్తే కేసులు పెడతామని పోలీసులు శ్రీనివాస్ ను హెచ్చరించారు.

    Trending Stories

    Related Stories