International

ఫేస్ బుక్ పేరు మారిపోయింది

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి..! ఎందుకంటే పేరు మారింది కేవలం ఫేస్ బుక్ మాతృ సంస్థది మాత్రమే. ఫేస్‌బుక్ పేరు మారబోతోందనే ప్రచారం గత కొద్ది రోజులుగా కొనసాగుతూ వచ్చింది. అదే నిజమైంది. ఇకపై ఈ కంపెనీని ‘మెటా’గా పిలవనున్నట్టు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. పేరు మార్పునకు గల కారణాలను జుకర్‌బర్గ్ వివరించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్) కు ప్రాధాన్యం పెరగబోతోందని, దానిని దృష్టిలో పెట్టుకునే ఫేస్‌బుక్ పేరును ‘మెటా’గా మార్చినట్టు పేర్కొన్నారు. ఈ సంస్థ అధీనంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్న సంగతి తెలిసిందే..! వాటి పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.. కేవలం వీటి మాతృసంస్థ పేరు మాత్రమే మారినట్టు చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో మెటావర్స్ వేదిక వందకోట్ల మందికి అందుబాటులోకి వస్తుందని, ఈ విధానంలో ప్రజలు కలుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేస్తారని జుకర్‌బర్గ్ తెలిపారు. లక్షలాదిమందికి ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తమ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్, హొరైజన్ వంటివి భాగంగా ఉన్నాయని, వీటన్నింటికీ ఫేస్‌బుక్ పేరు సెట్ అవ్వడం లేదని.. అందుకే పేరు మార్పునకు శ్రీకారం చుట్టామని అన్నారు. నిజానికి తమది ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను తయారుచేసే కంపెనీ అని కానీ, సామాజిక మాధ్యమ సంస్థగానే పరిగణిస్తున్నారని జుకర్‌బర్గ్ తెలిపారు.

Facebook revealed its new name: Meta - Lankaxpress

ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాండ్ పేరు మారింది. కొద్దిరోజుల కిందట ఫేస్ బుక్ కొన్ని గంటల పాటూ నిలిచిపోవడంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. అలాగే వేల కోట్ల రూపాయలు సంస్థ నష్టపోయింది. ఇకపై ఇలాంటివి జరగవని మార్క్ హామీ ఇచ్చారు.

Related Articles

Back to top button