చైనా హ్యాకర్లకు ఫేస్ బుక్ స్ట్రోక్

0
730

చైనాలో చాలాకాలం నుంచి వివాదాలను రేపుతూ వస్తోన్న గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో నివసించే ఉయ్‌ఘుర్ ముస్లింలు, ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, కొంతమంది సామాజిక కార్యకర్తలపై కోవర్ట్ ఆపరేషన్ సాగుతోందని, వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం ఈ చర్య తీసుకుంది.

చైనా.. ప్రపంచంలో దొంగతనాలు, ఆక్రమణలు, దుర్బుద్ధికోణాలు వంటివి మాటలు వినిపించినప్పుడల్లా మనకు వినిపించే దేశం పేరు.. ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తన స్వార్ధం కోసం ఎంతకైనా తెగించగల మూర్ఖులు ఏలుతున్న దేశం అది. కోవిడ్ కు ముందు కోవిడ్ తర్వాత ఆ దేశం తీరులో ఏమార్పు లేదు. అదే గుంట నక్కవిధానాలు. ఇప్పటికే పలు రంగాల్లో ప్రపంచ దేశాలనుంచి బ్యాన్ కు గురైన ఆ దేశం తాజాగా ఫేస్ బుక్ సంస్థ నుంచి కూడా నిషేధాజ్ఞలు ఎదుర్కొంది.
ఫేస్ బుక్ యాజమాన్యం.. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లన్నింటినీ బ్లాక్ చేసింది. అధికారికంగా వినియోగించే వాటితో పాటు, ఫేక్ ఐడీలతో సృష్టించిన అకౌంట్లన్నింటినీ స్తంభింపజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. తమ సంస్థ మార్గదర్శకాలు, విధానాలకు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. బహుశా ఇది శాశ్వత నిషేధం కూడా కావొచ్చు.
చైనాలో చాలాకాలం నుంచి వివాదాలను రేపుతూ వస్తోన్న గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో నివసించే ఉయ్‌ఘుర్ ముస్లింలు, ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, కొంతమంది సామాజిక కార్యకర్తలపై కోవర్ట్ ఆపరేషన్ సాగుతోందని, వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం ఈ చర్య తీసుకుంది. ఈ కోవర్ట్ ఆపరేషన్‌లో చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగా వారు వినియోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్లను హ్యాక్ చేయడం ఫోన్‌కాల్స్ లిస్ట్, ఫొటోలు వంటి వ్యక్తగత సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు వాటిని బహిర్గతం చేస్తున్నారని అనుమానించింది. అలాగే- విదేశాల్లో నివసిస్తోన్న చైనీయుల కార్యకలాపాలపైనా హ్యాకర్లు నిఘా ఉంచినట్లు ఫేస్‌బుక్ నిర్ధారించింది. అమెరికా సహా టర్కీ, కజకిస్తాన్, సిరియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో నివసిస్తోన్న చైనీయులపైనా ఈ కోవర్ట్ ఆపరేషన్ సాగిస్తున్నట్లు ధృవీకరించింది.
ఎర్త్ ఎంపుస, ఈవిల్ ఐ లేదా పాయిజన్ కార్ప్ వంటి పేర్లతో సృష్టించిన గ్రూపుల్లో 500 మందికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు పేర్కొంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లను స్తంభింపజేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − 7 =