International

ఇండో-యూ.ఎస్. వార్ గేమ్..!
చైనాకు ఇక ముచ్చెమటలే..!!

ఓవైపు భారత్‎తో గిల్లికజ్జాలు, మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్య ధోరణి, ఇంకోవైపు పెద్దన్నగా ఎదగాలనే పేరాశ. ఇలా సర్వ దురాశలకు కేంద్రంగా మారిన చైనా.. ప్రపంచ దేశాలతో శతృత్వం పెట్టుకుంటోంది. యుద్ధకాంక్షతో రగిలిపోతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పెరిగిపోవడంతో.. భారత్ అడుగడుగునా అడ్డుకుంది. గిల్లికజ్జాలకు వచ్చిన ప్రతిసారీ బుద్ధి చెప్పి బార్డర్ దాటిస్తోంది భారత సైన్యం. చైనాకు దూకుడుకు కళ్లెం వేస్తోంది. ఇప్పుడు భారత్ కు అమెరికా తోడైంది. డ్రాగన్ పైత్యానికి చెక్ పెట్టేందుకు.. ఇరు దేశాలు మల్టీ డొమైన్ వార్ గేమ్‌ను ప్రారంభించాయి.

ప్రస్తుతం భారత్, అమెరికా.. సైనికపరంగా, ఆయుధ శక్తి పరంగా బలోపేతంగా వున్నాయి. శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేసినా పిసగట్టే సమార్ధ్యం గల యుద్ద విమనాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్న సంయుక్త యుద్ధ విన్యాసాలు డ్రాగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రెండు ఆర్మీ సూపర్ పవర్లు కలిస్తే.. ఎలావుంటుందో జిత్తులమారికి రుచిచూపిస్తున్నాయి. హిందూ మహా సముద్రంలో జరిగిన విన్యాసాల్లో భాగంగా.. ఇరు దేశాలకు చెందిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

అణ్వాయుధ సామర్థ్యంగల విమాన వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ నేతృత్వంలో నావల్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అమెరికా మోహరించింది. వీటితో పాటు ఎఫ్-18 యుద్ధ విమానాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలయ్యే ఈ-2సీ హాక్ఐ విమానాలను కూడా విన్యాసాల కోసం అమెరికా మోహరించింది.

నిమిట్జ్ క్లాస్ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్, ఆర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ హాల్సీ, టికొండెరొగ క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ షిలోహ్ అమెరికా కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌లో ఉన్నాయి. విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్, ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కేరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కేరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. యుద్ద నౌకలను, మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు. జలాంతర్గాములు, విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే, వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు.

భారత్ కూడా తమ ఆయుధ బలగాలను ప్రదర్శనలో ఉంచింది. భారత్ మోహరించిన వాటిలో జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్-78 యుధ్ధ విమానం, అవాక్స్ విమానాలు ఉన్నాయి. వీటితోపాటు పీ8ఐ సముద్ర నిఘా విమానాలను, మిగ్29కే యుద్ధ విమానాలను మోహరించింది. ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను భారత్ మోహరించింది.

ఈ యుద్ధ విన్యాసాల్లో ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్లు, జలాంతర్గాములు ప్రముఖ పాత్ర పోషించాయి. విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్, ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కేరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కేరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. యుద్ద నౌకలను, మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు. జలాంతర్గాములు, విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే, వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు.

కేరళలోని తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటమే కాకుండా ఉమ్మడి శత్రువుకు సవాలు విసిరేలా యుద్ధ విన్యాసాలు కొనసాగాయి. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, భారత వాయు సేనకు చెందిన యుద్ధ విమానాలు.. అమెరికాకు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి భారత్ సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొన్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

one × five =

Back to top button