More

    శబరిమలలో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. చివరి నిమిషంలో భగ్నం చేసిన పోలీసులు

    ప్రసిద్ద పుణ్యక్షేత్రం శబరిమలకు భారీ ముప్పు తప్పింది. అయ్యప్ప భక్తులను టార్గెట్ చేస్తూ ముష్కరులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. తీవ్రవాదుల కుట్రలను పసిగట్టిన పోలీసులు భగ్నం చేశారు. శబరిమలకు సమీపంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే ఈ పేలుడు పదార్ధాలు లభ్యం కావడం కలకలం రేపుతుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని వడస్సెరిక్కరాలోని పెంగట్ వంతెన కింద ఆరు జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రిడ్జి కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు.

    పేలుడు పదార్ధాలను బాంబు స్వ్కాడ్ నిర్వీర్యం చేసింది. శబరిమల నుండి తిరువాభరణం మోసుకెళ్లే పేటికను ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు ఈ రహదారి గుండా పందళానికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ ఘటనపై తిరువాభరణం పథ పరిరక్షణ మండలి అధ్యక్షుడు పీజీ శశికుమార్ వర్మ, కార్యదర్శి ప్రసాద్ కుజిక్కులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ లోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరవిళక్కు ఉత్సవాలు ఈనెల 14న ప్రారంభమయ్యాయి. అయ్యప్ప తాను బాల్యాన్ని గడిపినట్టుగా విశ్వసించే పందళం ప్యాలెస్ నుండి తిరునాభవరణం అని పిలువబడే ఆభరణాలు తీసుకొచ్చి అయ్యప్పకు అలంకరించారు. అయ్యప్ప పవిత్ర ఆభరణాలను 80 కి.మీ దూరంలో ఉన్న పందళం ప్యాలెస్ నుండి ఊరేగింపుగా శబరిమల క్షేత్రానికి తీసుకు వచ్చారు.

    ఆ తర్వాత దీపారాధన చేశారు. దీపారాధన తర్వాత పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమఘాట్ పర్వత శ్రేణులలోని పొన్నంబలమేడు కొండపై జ్యోతి కన్పించింది. దీపారాధనతో ఏడు రోజుల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయ్యప్పకు అలంకరించిన ఆభరణాలను తిరిగి తీసుకెళ్లే సమయానికి కొన్ని గంటల ముందే పేలుడు పదార్ధాలు లభ్యం కావడం కలకలం రేపుతుంది. ఈ పేలుడు పదార్ధాలను ఎవరు పెట్టారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏమైనా ఈ పని చేశారా లేదా ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

    ఈ నెల 14న శబరిమల వద్ద 75 వేల మంది భక్తులకు మకర జ్యోతి దర్శనమైంది. కరోనా నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు, అధికారులు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేశారు. మకర జ్యోతి నక్షత్రం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కన్పిస్తుంది. ఇది ధనుస్సురాశి నుండి మకర రాశి వరకు సూర్యుడి సంచారాన్ని సూచిస్తుంది. జనవరి 14 నుండి మలయాళ నెల మకరం మొదటి రోజు. మకర జ్యోతి దర్శనంతో వార్షిక శబరిమల యాత్ర ముగింపును సూచిస్తుంది. మకరవిళక్కు ఉత్సవం ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు.

    Trending Stories

    Related Stories