More

  నిన్న కన్హయ్య.. నేడు జిందాల్..! బరితెగిస్తున్న మతోన్మాదులు..!!

  దేశంలో ఓ వ‌ర్గం అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయి. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రూ మాట్లాడినా.. ఎలాంటి ప‌నులు చేసినా దారుణాలకు ఒడిగ‌డుతున్నారు. పేరుకే మైనార్టీ వ‌ర్గంగా ఉన్నా.. దేశంలో వారి ఆగ‌డాల‌కు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఉదయ్ పూర్ టైలర్ దారుణ హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  ఇద్దరు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ సాహుకు 5 రోజుల క్రితం భయంకరమైన బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. తనకు వచ్చిన బెదిరింపులపై స్థానిక పోలీసులకు కన్హయ్య లాల్ ఫిర్యాదు చేశాడు. భయంతో ఐదు రోజుల పాటు షాపు కూడా తెరవలేదు. అయితే రక్షణ కల్పించాలని కన్హయ్య లాల్ కోరినా … పోలీసులు పట్టించుకోలేదు. ఇంతలోనే దారుణం జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తే ఈ దారుణం జరిగేది కాదని చెబుతున్నారు. కన్హయ్య లాల్ రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదన్న అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే పోలీసుల వైఫల్యం వల్లే దుండగులు టైలర్ ను దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

  రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలే దారుణం జరిగింది. ధన్‌ మండీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ టైలర్‌ను ఇద్దరు దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. టైలర్ షాపులోకి చొరబడ్డారు ఇద్దరు దుండగులు. ఒక దుండగుడు కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేయగా.. మరో దుండగుడు ఆ ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. పదునైన కత్తితో తల నరకడంతో టైలర్ స్పాట్ లోనే చనిపోయాడు. తర్వాత ఇద్దరు దుండగులు తామే హత్య చేశామంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య జరిగిన పోస్టుల వివాదంతోనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. టైలర్ హత్య ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మరో సెల్ఫీ వీడియోలో కత్తులో ప్రధాని మోదీని సైతం చంపుతామంటూ వాళ్లు బెదిరించారు. హత్యకు పాల్పడిన అక్తర్‌, గౌస్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షాపులన్ని మూతపడ్డాయి. జనాలు రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దుండగులను అరెస్ట్ చేయాలంటూ స్థానిక వ్యాపారులు ధర్నాకు దిగడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయ్ పూర్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజస్థాన్ లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  బీజేపీ సస్పెండెడ్‌ నేత నవీన్ కుమార్‌ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్‌ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్‌ జిందాల్‌.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్‌లో ట్యాగ్‌ చేశారు. నూపుర్‌ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్‌ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్‌ జిందాల్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి.

  Trending Stories

  Related Stories