More

    తాలిబాన్లు-పాక్ సైన్యానికి మధ్య కాల్పులు

    మంగళవారం కునార్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యానికి, తాలిబాన్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం కునార్‌లోని డంగామ్ జిల్లాలో పాక్ సైన్యం తాలిబాన్ దళాలపై కాల్పులు జరిపింది. తాలిబాన్లు కూడా ఎదురుతిరిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలకు దారితీసింది. పరిస్థితి చేయి దాటి పోతుందని భావించి.. పాకిస్తాన్ సైన్యం, తాలిబాన్ దళాలు ఈ ప్రాంతంలో సమావేశమయ్యాయి.

    పాకిస్తాన్ ఆర్మీ, తాలిబాన్ల మధ్య ఇలాంటి కాల్పులు గత కొద్ది నెలల నుండి కొనసాగుతూనే ఉంది. డిసెంబరు 2021లో, కునార్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ లైన్‌లో పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో సరిహద్దు ప్రాంతాలతో పాటు ఇరువైపులా భారీ ఎత్తున కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి 2,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుకు సంబంధించి ఇరుపక్షాల మధ్య ఘర్షణలు పదేపదే చోటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వెంబడి పాక్ సైన్యం భద్రతా కంచెను ఏర్పాటు చేయకపోవడంతో తాలిబాన్ యోధులు పాక్ సైన్యాన్ని అడ్డుకున్నారు.

    1,10,000 మంది సైనికులతో కూడిన సైన్యాన్ని సిద్ధం చేస్తున్న తాలిబాన్లు:

    ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉండడంతో. తాలిబాన్ 1,10,000 మందితో కూడిన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ప్రకటించారు. ఆఫ్ఘన్ మీడియా ఖామా ప్రెస్ ప్రకారం.. 10,000 మంది ఇప్పటికే దళంలో చేరారని, దాదాపు 80,000 మంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ముజాహిద్ వెల్లడించారు. ఈ బృందం దాదాపు 4,000 హెలికాప్టర్లు, విమానాలను సిద్ధం చేయగలవని రక్షణ మంత్రి వెల్లడించారు.

    Trending Stories

    Related Stories