International

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ బహిరంగ సభలో అబే ప్రసంగిస్తుండగా దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షింజో అక్కడికక్కడే కుప్పకూలారు. బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. సంఘటన జరిగిన వెంటనే ఆయనను ఒక హెలికాప్టర్‌లో నరా మెడికల్‌ యూనివర్శిటీ వైద్యశాలకు తరలించారు. ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షింజో కన్నుమూశారని అక్కడి అధికారులు తెలిపారు. . 2006-2007, 2012-20 రెండు పర్యాయాలుగా జపాన్‌ ప్రధానిగా షింజో అబే సేవలు అందించారు.

అబే కుప్పకూలిపోయిన తర్వాత కూడా నిందితుడు అక్కడే నిలబడి ఉన్నాడు. కనీసం పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అబేపై ఎందుకు కాల్పులు జరిపాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. జపాన్ టైమ్స్ నివేదించిన ప్రకారం, 67 ఏళ్ల అబే నారాలోని ఒక వీధిలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తున్నప్పుడు, గుర్తు తెలియని వ్యక్తి షాట్‌గన్‌తో అతనిపై దాడి చేసాడు. అతడి ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లింది. కాల్పులు జరిపిన తర్వాత అబేకు రక్తస్రావం అయిందని, గుండె ఆగిపోయిందని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Related Articles

Back to top button