More

    భార‌త ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయ‌ల్

    భార‌త ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో ముగ్గురు క‌మీష‌న‌ర్లు ఉంటారు. మే నెల‌లో చంద్ర రిటైర్ కావ‌డంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అనుప్ చంద్ర పాండే మ‌రో క‌మీష‌న‌ర్‌గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1985వ బ్యాచ్‌ పంజాబ్ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ అరుణ్ గోయల్. డిసెంబర్ 31వ తేదీన ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ న‌వంబ‌ర్ 18వ తేదీన ఆయ‌న స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేశారు. 2025 ఫిబ్ర‌వ‌రిలో రాజీవ్ కుమార్ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత సీఈసీగా గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ లేదా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఓ వ్య‌క్తి ఆరేళ్ల పాటు విధులు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు లేదా ఆ వ్య‌క్తి 65 ఏళ్లు నిండేవ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌వ‌చ్చు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేసిన అపాయింట్‌మెంట్‌ను నోటిఫై చేస్తూ న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరుణ్ గోయల్ నియామకంపై ఇప్పటికే ప్రకటన చేశారు.

    Trending Stories

    Related Stories