More

  కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలికి ఐసిస్ తో సంబంధాలు..!

  ప్రముఖ కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ ఎమ్మెల్యే దివంగత బీఎం ఇదీనబ్బ కుమారుడు బీఎం బాషా నివాసంపై జనవరి 3న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాషా కోడలు దీప్తి మర్లా అలియాస్ మరియంను ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. బాషా కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని మస్తికట్టె గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇదీనబ్బ మనవడి భార్య దీప్తి మార్లా యువతను ఐసిస్‌ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం ఆమెను సోమవారం అరెస్ట్‌ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

  ఎన్‌ఐఏ డిప్యూటీ ఎస్పీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని బృందం ఆ ఇంట్లో సోదాలు చేసింది. పలు డాక్యుమెంట్లను సెక్యూరిటీ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. మంగళూరులోని స్థానిక కోర్టులో ఎన్‌ఐఏ ఆమెను రిమాండ్‌కు తరలించి తదుపరి విచారణ కోసం న్యూఢిల్లీకి తీసుకెళ్లింది. NIA ఒక ప్రకటనలో “Today, NIA in co-operation with Karnataka Police arrested one ISIS operative Mundadiguttu Sadananda Marla Deepthi Marla alias Maryam w/o Anas Abdul Rahiman R/o Mangalore….” అంటూ అరెస్టు ధృవీకరిస్తూ ప్రకటన తెలిపింది. అనాస్‌ అబ్దుల్‌ రహమాన్‌ బంధువు అమ్మర్‌కు ఐఎస్‌ఐఎస్‌ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఆగస్టులో ఇదే ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు చేసి అరెస్ట్‌ చేసింది. ఆ సమయంలో మరియమ్‌ను ఎన్‌ఐఏ విచారించినా ఆమెను అదుపులోకి తీసుకోలేదు. గత ఐదు నెలల్లో, అనుమానిత ISIS లింక్‌ల విషయంలో అరెస్టు చేయడానికి భద్రతా ఏజెన్సీ ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిందని నివేదికలు సూచిస్తున్నాయి.

  న్యూస్ 18 మీడియా సంస్థ కర్ణాటక పోలీసు సీనియర్ అధికారిని ఉటంకిస్తూ, “మరియమ్ అలియాస్ దీప్తి మార్లా, దివంగత ఇదీనబ్బా మనవరాలు అయిన ISIS సభ్యుడు అజ్మలాతో టచ్‌లో ఉంది. అజ్మలా ఇదినబ్బ కూతురు కూతురు. ఆమెకు దీప్తి కజిన్ అవుతుంది. అజ్మలా కొన్ని సంవత్సరాల క్రితం సిరియాకు పారిపోయింది. ఆమె ISIS సభ్యురాలు అని నమ్ముతారు. మరియమ్ కు వివాహం కాకముందు హిందువు. ఆమె మంచి కుటుంబానికి చెందినది. ఆమె పేరు దీప్తి మార్లా. ఆమె యూఏఈలో చదువుకుంది. ఆమె అక్కడ ఇస్లాం వైపు ఆకర్షితురాలైంది, తన స్వస్థలానికి చెందిన ముస్లింను వివాహం చేసుకుంది. తరువాత మతం మార్చుకుంది.” అని కథనాన్ని రాసింది.

  మార్చి 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయని NIA పేర్కొంది. దర్యాప్తు సంస్థ మహ్మద్ అమీన్ అలియాస్ అబూ యాహ్యా మరియు ఇద్దరు సహచరులైన డాక్టర్ రహీస్ రషీద్ ముస్’హబ్ అన్వర్‌లను అరెస్టు చేసింది. తర్వాత ఆగస్టు 2021లో అమ్మర్‌తో సహా మరో నలుగురిని అరెస్టు చేశారు. పశ్చిమాసియాలో ఐసిస్‌లో చేరేందుకు ప్లాన్‌ చేస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మహిళలను కూడా ఎన్‌ఐఏ అదే నెలలో అరెస్టు చేసింది.

  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, NIA మాట్లాడుతూ, “సిరియా/ఇరాక్‌లో ISIS క్షీణించిన తర్వాత, దీప్తి మార్లా, మొహమ్మద్ అమీన్ జనవరి, మార్చి 2020లో కశ్మీర్‌ను సందర్శించారు. మహ్మద్ అమీన్‌తో పాటు తీవ్రవాద సంస్థ కుట్రకు దీప్తి మార్లా కింగ్‌పిన్ అని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు నిధులను సేకరించడం, రాడికల్‌స్ గా మార్చడం, ప్రజలను ప్రేరేపించడం వంటి ఆరోపణలపై ఇప్పటివరకు 11 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. 2016లో ISISలో చేరేందుకు దేశం విడిచి పారిపోయిన కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన 13 మందిలో అమ్మర్ మేనకోడలు అజ్మలా ఒకరు. ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లో ఐఎస్‌లో చేరాడు. ఆ సమయంలో కేరళ నుంచి ఐఎస్‌లో చేరేందుకు మొత్తం 21 మంది దేశం విడిచి పారిపోయారు. గత ఏడాది ఎన్‌ఐఏ నమోదు చేసిన సుమోటో కేసు ప్రకారం, మహ్మద్ అమీన్ అతని సహచరులు ఇన్‌స్టాగ్రామ్, హూప్ మరియు టెలిగ్రామ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఐసిస్‌లో వ్యక్తులను రిక్రూట్ చేయడానికి ప్రచార ఛానెల్‌లను నడుపుతున్నారు.

  Trending Stories

  Related Stories