తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈవీఎం కలకలం

0
764

పశ్చిమ బెంగాల్ లో ఓ తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మూడో దశ పోలింగ్.. మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందనగా ఈ ఘటన వెలుగు చూసింది. ఎలక్షన్ విధులకు సంబంధించిన వాహనం తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఉండటాన్ని చూసినా కొంతమంది బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో పోలింగ్ బూత్ ను, కంట్రోల్ రూమ్ ను విడిచి ఎక్కడకు వెళ్లకూడదని.. ఈసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అందుకు బాధ్యుడైన ఎన్నికల అధికారిని ఈసీ సస్పెండ్ చేసింది.

పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లా…ఉలుబెరియా నార్త్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిర్వాహణకు సంబంధించి తపన్ సర్కార్ అనే ప్రభుత్వ ఉద్యోగి… సెక్టార్ అధికారిగా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం కేటాయించిన రెస్టు రూమ్ లో ఉండాల్సిన ఆయన  తన బంధువైన తృణమల్ కాంగ్రెస్ నేత గౌతమ్ ఘోష్ ఇంటికి వెళ్లాడు.అతనితోపాటు వచ్చిన ఎన్నికల సిబ్బందితోపాటు ఈవీఎంలు కూడా అక్కడే ఉంచారు. అక్కడే రాత్రి తపన్ సర్కార్ నిద్రపోయినట్లు తెలుస్తోంది.దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఈసీ… తపన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని చర్య భారత ఎన్నికల సంఘం ఆదేశాల  ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. అలాగే తపన్ తో ఉన్న సిబ్బందిని సైతం సస్పెండ్ చేసింది.

అటు ఈవీఎం సీళ్లను పరిశీలించి వాటిని వేరుగా ఉంచారు. తపన్ వద్ద ఉన్న ఈవీఎం రిజర్వ్ చేసినదని,  ఏదైనా  పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయిస్తే వెంటనే అక్కడికి పంపించేందుకు వీలుగా దానిని రెడీగా ఉంచినట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ఈసీ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఓటింగ్ రోజును ఇలాంటి ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోందని… ఇది తీవ్రమైన చర్య అని కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇంతకు ముందు అస్సాంలో రోడ్డుపై పోలింగ్ సిబ్బంది వెళ్తున్న వాహనం చెడిపోయిన సందర్భంలో,  ఆదారి వెంట వెళ్తున్న ఓ బీజేపీ నేతను ఎన్నికల సిబ్బంది లిప్ట్ అడిగారు. అతని వాహనంపై పార్టీకి సంబంధించిన ఎలాంటి చిహ్నాలు లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది అతని వాహనంలో వెళ్లారు. దీనిపై కాంగ్రెస్, టీఎంసీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడాన్ని, బీజేపీ నేతలు ఎందుకు వదిలిపెడతారు చెప్పండి.! వారు చేయాల్సిదంతా చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ నేత వాహనంలో ఈవీఎం అనే వార్తను నేషనల్ మీడియాతోపాటు మన తెలుగు మీడియా చానెళ్ల బాగానే హైలెట్ చేశాయి. కానీ ఇప్పుడు…టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం వార్తకు మాత్రం అంతగా ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు.. ఎందుకంటారు!  

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =