More

    కదిలిన ‘ఎవర్ గివెన్’.. సూయిజ్ కాలువలో ట్రాఫిక్ క్లియరెన్స్ కు బలమైన అడ్డుంకులివే..!

    కెనాల్‌లోని ఈ భారీ నౌకను ప్రస్తుతం 30 డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించగలిగారు. 11 టగ్ బోట్స్‌ తో ఈ భారీ నౌకను పూర్తిగా పక్కకు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా.. షిప్ చుట్టూ ఇసుకను తొలగించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇప్పటివరకూ క్లియర్ చేశారు. మరిన్ని టగ్ బోట్లను రంగంలోకి దించి షిప్‌కు పక్కకు జరపాలని ఈజిప్షియన్ అథారిటీ భావిస్తోంది.

    ‘ఎవర్ గివెన్’ నౌక గురించి దాదాపు వారం రోజుల తర్వాత ఓ శుభవార్త తెలిసింది. ఈ ‘ఎవర్ గివెన్’ నౌక ఎట్టకేలకు కదిలింది. దీంతో.. వీలైనంత త్వరగా నౌకను అక్కడి నుంచి తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

    ప్రబుఖ వెబ్ పోర్టల్ అందించిన వివరాల ప్రకారం.. ఈ భారీ నౌక 80 శాతం కుడి వైపుకు జరిగిందని సోమవారం ఇవాళ అక్కడి అధికారులు ప్రకటించారు. గత వారం రోజులుగా నిలిచిపోయిన ‘నౌకా వాణిజ్యం’ త్వరలో మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    అయితే.. ఈ నౌకను కదిలించడానికి అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఈ భారీ నౌకకు వెనుక భాగాన ఇనుప తాళ్లు కట్టి టగ్ బోట్లతో పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం కొంత సానుకూల ఫలితాన్నే ఇచ్చింది.

    ఈ భారీ నౌక 2,20,000 టన్నుల బరువుంది. ఇంత బరువున్న ఈ నౌక మొత్తానికి 80 శాతం వరకూ కుడి వైపుకు మళ్లడంతో టగ్ ‌బోట్స్‌ లో ఉన్న వారు హారన్స్ మోగిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సూయజ్ కాలువ మొత్తాన్ని మూసివేసిన ఈ నౌకను పక్కకు జరిపి ఇతర ఓడల రాకపోకలకు వీలు కల్పించేందుకు ఇక ఎక్కువ రోజులేమీ పట్టదని అక్కడి అధికారులు చెప్పారు. నౌక పూర్తిగా నీటిలో తేలితే మూడు నుంచి మూడున్నర రోజుల్లో ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయొచ్చని సూయజ్ కెనాల్ అథారిటీ తెలిపింది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా నీటిలో తేలడానికి సమయం ఎక్కువగానే పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    కెనాల్‌లోని ఈ భారీ నౌకను ప్రస్తుతం 30 డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించగలిగారు. 11 టగ్ బోట్స్‌ తో ఈ భారీ నౌకను పూర్తిగా పక్కకు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా.. షిప్ చుట్టూ ఇసుకను తొలగించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇప్పటివరకూ క్లియర్ చేశారు. మరిన్ని టగ్ బోట్లను రంగంలోకి దించి షిప్‌కు పక్కకు జరపాలని ఈజిప్షియన్ అథారిటీ భావిస్తోంది.

    డచ్‌కు చెందిన అల్ప్ గార్డ్, ఇటలీకి చెందిన కార్లో మ్యాగ్నో ఇప్పటికే సహాయక చర్యల్లో భాగమయ్యాయి. సూయజ్ కాలువ‌లో ఈ భారీ నౌక చిక్కుకుపోవడం మూలాన అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రోజుకు దాదాపు 6 నుంచి 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మార్చి 23న బలమైన గాలులు వీయడంతో ఈ ‘ఎవర్ గివెన్’ నౌక అదుపు తప్పి సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన విషయం తదనంతర పరిణామాలు మనకు తెలిసిందే..

    Trending Stories

    Related Stories