More

    రష్యా ఇకపై ఉగ్రవాద ప్రోత్సాహక దేశం.. ఈయూ పార్లమెంట్‌ ప్రకటన

    ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో నిర్వహించిన ఓటింగ్‌కు 494 మంది మద్దతు పలకగా 58 మంది వ్యతిరేకించారు. 44 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా, పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందని, కాబట్టి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా రష్యాను ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించింది. యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్‌ పార్లమెంట్‌ రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా తీర్మానించడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. ఐరోపా పార్లమెంటు తీర్మానం పట్ల రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూరోపియన్ పార్లమెంటును మూర్ఖత్వానికి స్పాన్సర్‌గా నియమించాలని ప్రతిపాదిస్తున్నానని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Trending Stories

    Related Stories