More

  తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..! ఈటెల నేతృత్వంలో కీలక కమిటీ..!!

  తెలంగాణలో బీజేపీ జెట్ స్పీడ్‎తో దూసుకుపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు గ్రాండ్ సక్సెస్ కావడంతో కమలదళం ఫుల్ జోష్ మీద ఉంది. రాబోయే ఎన్నికలే టార్గెట్‎గా అధికార పార్టీని బీట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై సెంట్రల్ బీజేపీ సైతం ఫోకస్​ పెట్టింది.

  జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలను నియమించింది. ఈటల రాజేందర్​ కన్వీనర్​గా చేరికలపై సమన్వయ కమిటీని, జితేందర్​రెడ్డి కన్వీనర్​గా ఫైనాన్స్​ కమిటీని, ధర్మపురి అర్వింద్​ కన్వీనర్​గా ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన స్థానంలో చేరికల కమిటీ బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‎కు అప్పగించారు.

  చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటెల రాజేందర్ నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. దానిలో డీకే అరుణ, కె. లక్ష్మణ్​, వివేక్​ వెంకటస్వామి, గరికపాటి మోహన్​రావు, ఎ.చంద్రశేఖర్​, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, దుగ్యాల ప్రదీప్​కుమార్ లను సభ్యులుగా నియమించారు. అలాగే తెలంగాణ బీజేపీ ఫైనాన్స్ కమిటీని సైతం నియమించారు. ఈ కమిటీకి జితేందర్​రెడ్డిని కన్వీనర్ గా నియమించారు. ఇక గరికపాటి మోహన్​రావు, చాడ సురేశ్​రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శాంతి కుమార్​, యోగానంద్​ లను దానిలో సభ్యులుగా నియమించారు. అటూ ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ కూడా నియమించారు. దీనికి ధర్మపురి అర్వింద్ ను కన్వీనర్​ గా నియమించారు. అందులో వివేక్​ వెంకటస్వామి, రఘునందన్​రావు, స్వామిగౌడ్, ప్రకాశ్​రెడ్డి, బాబీ అజ్మీరాలను సభ్యులుగా నియమించారు.

  టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేయడంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల భేటీ జరిగింది. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభపై, మొత్తం 119 నియోజకవర్గాల్లో జరిగిన సంపర్క్ యోజనపై ఇందులో సమీక్షించారు. అంతేగాక, పార్లమెంటు ప్రవాస్‌ యోజన తయారీపై చర్చతో పాటు భవిష్యత్‌ కార్యక్రమాలపై కసరత్తు చేసినట్లు సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడే జరగడం, విజయసంకల్ప సభ విజయవంతం కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

  అయితే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని పదేపదే కేంద్ర బిజెపి పెద్దలతో పాటు తెలంగాణ బిజెపి నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మీటింగ్ లోనూ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే మూడు కమిటీల ద్వారా టిఆర్ఎస్ వైశాల్యాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు బిజెపిని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా కేంద్ర బిజెపి పెద్ద సూచనతో బండి సంజయ్ ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల వరకు నిరంతరంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లేలా తెలంగాణ బిజెపి వ్యూహాలు రచిస్తోంది.

  spot_img

  Trending Stories

  Related Stories