Telugu States

హరీష్ రావుకు కూడా నాకు పట్టిన గతే: ఈటల

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఈటల వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు. పార్టీ పెద్దల మెప్పు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. త్వరలో హరీశ్ రావుకు కూడా తనకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందని ఈటల అన్నారు. మీ పార్టీ నుంచి గెలిచానని అన్నారుగా… అందుకే రాజీనామా చేశా. డబ్బు, ఇతర ప్రలోభాలను పాతరేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందని అన్నారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు.

పార్టీ పెద్దల మెప్పు పొందాలని హరీశ్ రావు చూస్తున్నాడని.. అయితే ఇదీ కాసేపు మాత్రమే ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి తనపై వ్యాఖ్యలు చేయిస్తోందని.. దీంతో వారు తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో కూడా తాను వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

6 + five =

Back to top button