Telugu States

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవ్వకముందే ప్రలోభాలకు దిగిన టీఆర్ఎస్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ పోటీకి దిగనున్నారు. అయితే ఇంకా షెడ్యూల్ విడుదల చేయకముందే టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు దిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని అన్నారు. దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని.. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 దొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగ ఓట్లపై ప్రజలు నిఘా పెట్టాలని, ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. ఉద్యమకారుల రక్తాన్ని చూసినవారు కేసీఆర్ వెంట ఉన్నారని ఆయన చెప్పారు. మీ ఓటును తొలగించకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రజలను కోరారు. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

తనకు టికెట్‌ ఇచ్చినవాళ్లే తనను ఓడగొట్టాలని చూశారని.. అధికార పార్టీలో ఉన్నా కూడా తన ఇంటి మీద పోలీసులతో దాడి చేయించారని విమర్శించారు. వాటన్నింటినీ భరిస్తూ వచ్చానని తెలిపారు. ప్రజల తరఫున పింఛన్లు ఇవ్వాలని అడిగానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఫించన్లు, కొత్త రేషన్‌ కార్డులు కావాలని అధిష్టానాన్ని కోరానన్నారు. ఇవన్నీ అడిగినందుకే తనను బయటకు పంపారన్నారు. అందరూ ఆలోచించి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం ప్రశ్నిస్తేనే తనను బయటికి పంపారని ఈటల రాజేందర్‌ అన్నారు. 18 ఏళ్లుగా తమ్ముడిగా పిలిచి.. అర గంటలోనే దెయ్యం ఎలా అయ్యానని ప్రశ్నించారు. నా దగ్గరకు ఎవరూ వచ్చినా నా చేతనైనా సాయం చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ డబ్బు, దర్పం చూపలేదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 6 =

Back to top button