ఓటిటిలో కూడా ‘కార్తికేయ-2’ ప్రభంజనం : 48 గంటల్లో 100 కోట్ల నిమిషాలకు పైగా స్ట్రీమింగ్!!

0
747
Epic Blockbuster Karthikeya 2 clocks 100 Crore Streaming Minutes on ZEE 5
Epic Blockbuster Karthikeya 2 clocks 100 Crore Streaming Minutes on ZEE 5

కృష్ణతత్వం..దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన ‘కార్తికేయ 2’ సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో ‘కార్తికేయ 2’ కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. నిఖిల్ సినీ కెరీర్ లో అత్యధికంగా కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. ఆగస్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ ‘కార్తికేయ 2’ బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. తాజాగా జీ 5 ఓటిటి లో విడుదలైన ‘కార్తికేయ-2’ చిత్రం కేవలం 48 గంటల్లో 100 కోట్లు పైగా నిమిషాల స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్నీ జీ5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మాములుగా థియేటర్స్ లోనే ప్రభంజనం చూపించడం కాకుండా ఓటిటి లో అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం!!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × five =