More

    అంతర్జాతీయ వేదికపై’కశ్మీర్ ఫైల్స్’ వివాదం.. భారత్‎కు ఇజ్రాయెల్ రాయబారి క్షమాపణ

    ది ‘కశ్మీర్ ఫైల్స్’ అసభ్యకర చిత్రమంటూ జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ లో ఆ దేశ రాయబారి నావోర్ గిలాన్ స్పందించారు. లాపిడ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. భారతీయ సంప్రదాయంలో అతిథిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేశానికి వచ్చి ఇఫిలో జడ్జీ ప్యానెల్‎కు హెడ్‎గా ఉన్న లాపిడ్ .. ఆతిథ్యమిచ్చిన దేశాన్ని అవమానించారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా.. అని గిలాన్ ట్విటర్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.

    ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. అనుపమ్‎ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇఫిలో ఇండియన్ పనోరమ్ సెక్షన్‎లో భాగంగా నవంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

    Trending Stories

    Related Stories