More

  టాస్ ఓడిన భారత్.. ఇరు జట్లివే

  ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వాయిదా పడిన భార‌త్‌,ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదో టెస్టు మ్యాచ్ బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా మొదలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుర్మా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు తొలుత బౌలింగ్ చేయాల‌ని ఎంచుకుంది.

  భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(సి)

  ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), సామ్ బిల్లింగ్స్(w), మ్యాటీ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్

  ఐదు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భార‌త్ జ‌ట్టు 2-1 ఆధిక్య‌త‌లో ఉంది. ఐదో టెస్టులో విజ‌యం సాధించినా, లేదంటే మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా, సిరీస్ భార‌త్ వశం కానుంది. భారతజ‌ట్టుకు ఓ ఫాస్ట్ బౌల‌ర్ టెస్టు జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వహ‌రించ‌డం అరుదు. గ‌తంలో క‌పిల్ దేవ్ హ‌యాంలో మాత్ర‌మే టీమిండియా టెస్టు జ‌ట్టుకు ఫాస్ట్ బౌల‌ర్ నాయ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అందుబాటులో లేక‌పోవడంతో ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ ప‌గ్గాలు ద‌క్కాయి. బుధవారం రెండోసారి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన చివరి పేసర్ కపిల్ దేవ్. అతను చివరిసారిగా 1987లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుండి టెస్టు క్రికెట్‌లో భారత్ జట్టుకి నాయకత్వం వహించే ఫాస్ట్ బౌలర్ భారత్‌కు ఎప్పుడూ రాలేదు. 1932లో దేశం తొలిసారి ఆడినప్పటి నుంచి భారత్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో నాయకత్వం వహించిన 36వ క్రికెటర్ బుమ్రా.

  spot_img

  Trending Stories

  Related Stories