More

    హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్సింగ్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ముంబైలో ఓపెన్

    హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన ఆందోళన కలిగిస్తోంది. సఖిరెడ్డి వర్షిణి అనే విద్యార్థిని మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. జులై 7న కాలేజీకి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. వర్షణి సమీప బంధువు మోహన్ రెడ్డి గురువారం ఆమెను సీఎంఆర్ టెక్నికల్ కళాశాల వద్ద డ్రాప్ చేశారు. మిడ్ ఎగ్జామ్ నిమిత్తం ఆమె కాలేజీకి వెళ్లింది. ఐడీ కార్డ్, మొబైల్ ఇంట్లోనే మరిచిపోయింది. దీంతో క్యాంపస్ నుంచి తిరిగి బయటికి వచ్చిన వర్షిణి.. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షిణి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

    కాలేజ్‌ సమీపంలో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. వర్షిణి కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. అయితే అక్కడి నుంచి ఆమె ఎటూ వెళ్లిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చివరిగా ముంబై‌లో ఓపెన్ అయినట్టుగా పోలీసులను గుర్తించారు. వర్షిణిని ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్షిణి తండ్రి సఖిరెడ్డి శివాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మేడ్చల్‌లో నివాసం ఉంటూ కుమార్తెను సీఎంఆర్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నారు. కాలేజీకి వెళ్లిన వర్షిణి ఎంతకూ తిరిగి రాకపోవడంతో గురువారం రాత్రి వరకు కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికి.. రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories