More

    టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు

    టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులను జారీ చేసింది. ఆయనతో పాటూ మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి లకు కూడ నోటీసులు జారీ చేసింది. హవాలా,ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. రేపు,ఎల్లుండి విచారణకు హజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో వ్యవహరింలో ఈడీ నోటీసులు ఇచ్చింది. హవాలా,ఫెమా ఉల్లంఘనల కేసులో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తలసాని ధర్మేంద్రయాదవ్, మహేష్ యాదవ్ లను ఈడీ విచారించింది. తాజాగా ఎల్.రమణ, దేవేందర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారించారు. మనీలాండరింగ్ వ్యవహారంలోనూ.. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరిపారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీశారు. వారికి కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాల్లో తలసాని సోదరుల లావాదేవీలు ఉన్నట్లుగా పలు తెలుగు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.

    Trending Stories

    Related Stories