More

    హైదరాబాద్ లో మరోసారి ఈడీ రైడ్స్.. 15 ప్రాంతాల్లో సోదాలు..!

    హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రముఖ ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏక కాలంలో 15 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. పటాన్ చెరు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి సహా 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు ప్రముఖ కంపెనీలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోడానికి అధికారులు సిద్ధమయ్యారు.

    Trending Stories

    Related Stories