More

    హైబ్రిడ్ తీవ్రవాదిని హతమార్చిన భద్రతాబలగాలు

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఓ హైబ్రీడ్‌ టెర్రరిస్టు హతమయ్యాడు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బేహార్‌ ప్రాంతంలో రహస్య స్థావరాలను గుర్తించడానికి భద్రత దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ హైబ్రిడ్‌ టెర్రరిస్ట్‌ చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మృతుడిని సజ్జాన్‌ తంత్రేగా గుర్తించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదిగా గుర్తించారు. నవంబర్‌ 13న బిబ్‌ బెహారాలోని రఖ్‌మోమెన్‌లో స్థానికేతర కూలీ హత్యకేసులో అతని ప్రమేయం ఉందని తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories