ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌లోని పెమెరా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్షిణి తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పారియిపోన మావోయిస్టుల కోసం ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు.