కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోని హిట్లర్‌తో పోల్చిన ఎలన్‌ మస్క్‌

0
797

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోని అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోల్చాడు టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌. కెనడాలో వ్యాక్సిన్‌ తప్పనిసరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు మద్దతు ప్రకటించాడు ఎలన్‌ మస్క్‌. ట్రూడోను అభినవ హిట్లర్‌గా పేర్కొంటూ బుధవారం రాత్రి ట్వీట్‌ చేశాడు.. కానీ గురువారం మధ్యాహ్నం ఆ ట్వీట్ ను ఎలన్ మస్క్ తొలగించాడు. కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు ట్రూడో ప్రభుత్వం వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు ఆందోళన బాటపడ్డారు. అమెరికా-కెనడా సరహద్దుల వద్ద పెద్దఎత్తున ట్రక్కులను నిలిపి ఆందోళన చేస్తున్నారు. వారికి టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ ఇప్పటికే మద్దతు తెలిపారు. వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలంటూ డ్రైవర్లు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. అమెరికా కెనడా సరిహద్దులను ట్రక్కర్లు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజాగా ఎలాన్ మస్క్ జస్టిన్ ట్రూడోను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చడంతో ట్విట్టర్‌లో హాట్ టాపిక్ గా మారింది. జనవరి నెల చివరలో టెస్లా ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ కెనడియన్ ట్రక్కర్లకు మద్దతుగా ట్వీట్ చేశారు. ట్రూడో ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఆరోగ్య విధానాలపై ట్రక్కు డ్రైవర్ల వ్యతిరేకతకు సంబంధించిన అంశం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నిరసనకారులకు నిధులను తగ్గించడంలో సహాయం చేయమని ట్రూడో ప్రభుత్వం బ్యాంకులను ఎలా ఆదేశించిందో వివరిస్తూ చేసిన ట్వీట్‌పై మస్క్ హిట్లర్ ఫోటో యొక్క మీమ్‌ను పోస్ట్ చేశాడు.

మస్క్‌కి ట్విట్టర్‌లో 74 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు మార్కెటింగ్ వరంలా మారింది. మస్క్ బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఆయన ట్వీట్లలో హాస్యం, విమర్శలు.. ఇలా పలు అంశాలు ఉంటాయి.