Telugu States

బీజేపీ చేస్తున్న ‘సాలు దొర.. సెలవు దొర’ ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం

ఎన్నికల సంఘం బీజేపీ చేపట్టిన ‘సాలు దొర.. సెలవు దొర’ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో పెట్టి ఈ నినాదంతో పోస్టర్లను ముద్రించేందుకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ‘సాలు దొర.. సెలవు దొర’ అనే డిజిటిల్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇదే నినాదంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ‘సాలు దొర.. సెలవు దొర’ ప్రచారానికి అనుమతిని కోరుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఆశ్రయించింది. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.

సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నిరాకరించింది. అలా చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం ఫొటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

Related Articles

Back to top button