More

    సంపూర్ణ మెజారిటీ సాధించిన షిండే.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

    మహారాష్ట్ర అసెంబ్లీ బల పరీక్షలో ఏక్‌నాథ్ షిండే సంపూర్ణ మెజారిటీతో గెలుపొందాడు. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ తరపున ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని భావించినా.. ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏన్‌నాథ్ షిండే ఎన్నికయ్యాడు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే లోక్ సభలో బలపరీక్షను ఎదుర్కొన్నాడు. ఈ బల పరీక్షలో ఏక్ నాథ్ షిండే సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులుండగా.. మెజరిటి కావాలంటే 145 మంది సపోర్ట్ ఉండాలి. ఏక్‌నాథ్ షిండేకు 164 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిస్తూ.. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories